తిరుమల, తిరుపతిలో రెడ్ అలర్ట్ ... తనిఖీలు ముమ్మరం

తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాలు జారీ చేశారు.

news18-telugu
Updated: August 24, 2019, 10:18 AM IST
తిరుమల, తిరుపతిలో రెడ్ అలర్ట్ ... తనిఖీలు ముమ్మరం
తిరుమల, తిరుపతిలో రెడ్ అలర్ట్ ... తనిఖీలు ముమ్మరం, Red alert in Tirumala, Tirupati Security heightened at famous temples
  • Share this:
సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఉగ్రవాదుల కదలికలున్నాయన్న నిఘా సమాచారంతో తిరుపతి అర్బన్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీలు చేయాలని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాలు జారీ చేశారు. అనుమానస్పదంగా ఎవరూ కనిపించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ మేరకు తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే మార్గాల్లో పోలీసులు తనీఖీలను ముమ్మరం చేశారు. రేణిగుంట, రామానుజ సర్కిల్, తనపల్లి రోడ్డు మొదలుకుని చంద్రగిరి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను పోలీసులు పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు.  తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ప్రకటించారు.

First published: August 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు