హోమ్ /వార్తలు /క్రైమ్ /

వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు..

వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అశ్లీల నృత్యాల తిలకించేందుకు స్థానిక యువకులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా యువకులు తరలివచ్చారు.

భక్తిశ్రద్ధలతో సాగాల్సిన వినాయక చవితి వేడుకల్లో అక్కక అపచారం జరిగింది. విజయవాడ శివారు నున్న సమీపంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొందరు యువకులు మహిళలను తీసుకొచ్చి గురువారం రాత్రి రికార్డ్ డ్యాన్సులు చేయించారు. అశ్లీల నృత్యాలు చేసేందుకు స్థానిక యువకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన యువకులు కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ పోగుచేరారు. ఈ అనూహ్య పరిణామంతో స్థానికులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. స్థానిక మహిళలు తమ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని అశ్లీల నృత్యాలను అడ్డుకున్నారు. నిర్వహకులతో పాటు అశ్లీల నృత్యాలు చేస్తున్న మహిళలను అరెస్ట చేశారు. నలుగురు మహిళలు సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. యువకులపై 290, 294 సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు