కరోనా ఎఫెక్ట్.. మాస్కు ధరించని 67వేల మందిపై కేసు..

బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది. అయితే ఈ నిబంధన ఉల్లంఘించి మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినందుకు తెలంగాణ వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు.

news18-telugu
Updated: July 2, 2020, 8:54 AM IST
కరోనా ఎఫెక్ట్.. మాస్కు ధరించని 67వేల మందిపై కేసు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వాస్తవానికి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది. అయితే ఈ నిబంధన ఉల్లంఘించి మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగినందుకు తెలంగాణ వ్యాప్తంగా 67,557 మందిపై పోలీసులు ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 3288 మందికి ఈ-చలానాలు సైతం జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి విధించిన లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన మార్చి 22 నుంచి జూన్ 30వ తేదీ వరకు 29 పోలీసు యూనిట్ల పరిధిలో ఈ కేసులను నమోదు చేశారు.

ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 14,931 మందిపై కేసులతో మొదటి స్థానంలో నిలిచింది. రామగుండం కమిషనరేట్(8290), ఖమ్మం(6372), సూర్యాపేట(4213), వరంగల్(3907) కేసులతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులతో చివరి స్థానంలో నిలిచింది.
First published: July 2, 2020, 8:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading