పెళ్లయిన 20 రోజులకే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి..

హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 20 రోజుల క్రితం ప్రియుడు కార్తీక్‌ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది.

news18-telugu
Updated: December 4, 2019, 12:37 PM IST
పెళ్లయిన 20 రోజులకే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి..
మృతురాలు పూర్ణిమ
  • Share this:
హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పూర్ణిమ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 20 రోజుల క్రితం ప్రియుడు కార్తీక్‌ను ఆమె వివాహం చేసుకుంది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్తీకే పూర్ణిమను హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీంతో కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. నిజానిజాలేంటన్నది త్వరలోనే తేలుస్తామని చెప్పారు. ఏదేమైనా మహిళలపై వరుసగా చోటు చేసుకుంటున్న నేరాలు సమాజాన్ని కలవరపాటుకి గురిచేస్తున్నాయి. దిశ హత్యాచార ఘటన తర్వాత
సమాజం నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నా.. మహిళలపై నేరాలకు పాల్పడవుతున్నవారు మాత్రం వెనక్కి తగ్గట్లేదు.


(మృతురాలు పూర్ణిమ..)

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...