అక్రమ దందాలతో పాటు చట్టవ్యతిరేక కాలాపాలకు అలవాటు పడ్డ ఓ మాజీ నక్సలైట్ వాటికే బలయ్యాడు.. కనీస బాధ్యతలకు దూరంగా వ్వాపారాలు చేస్తూ చట్టవ్యతిరేకంగా పనిచేసే శక్తులతో జతకట్టాడు చివరకు ఆ శక్తులకే బలయయ్యాడు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్‌లు కలిసి హత్య చేసి ఆ తర్వాత తల, మొండెం వేరు చేశారు.
వివరాల్లోకి వెళితే..నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం, వద్దిపట్లకు చెందిన నామ శ్రీనివాస్(38), ఆదిబట్ల మున్సిపల్ సమీపంలోని బొంగ్లూర్ వద్ద మెట్రోసిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య కవిత 16 ఏళ్ల క్రితమే మృతిచెందింది. ప్రస్తుతం ఆయన మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెండు నెలలుగా కనిపించకకుండా పోయాడు.ఈ విషయాన్ని ఆయనతో సహజీవనం చేస్తున్న మహిళ శ్రీనివాస్ బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు... కాగా పోలీసులు విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి... రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు ఎల్‌బీనగర్‌లో స్నేహితులు ఉన్నారు. వీరిలో బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ అనే ట్రాన్స్‌జెండర్‌తో కలిసి ఉండేవాడు.
Hyderabad : దారుణం.. సహజీవనం వద్దని వెళ్లిన మహిళ సజీవదహానం.. ?
నకిలీ బంగారం వ్యాపారం..
వీరిలో బ్రహ్మచారి నకిలీ బంగారం వ్యాపారం చేస్తుండగా... అతనిపై ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అయితే బ్రహ్మచారితో కూడా స్వాతి అనే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.. అయితే స్వాతిపై శ్రీనివాస్ కన్నేశాడు.. దీంతో బ్రహ్నచారిని నమ్మించి ఆయన్ను మెట్రోసిటిలో పోలీసులకు ఆచూకి తెలియకుండా చేశాడు.. ఆ తర్వాత తానే పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించాడు. బ్రహ్మచారి జైల్లో ఉన్న సమయంలోనే స్వాతికి దగ్గరయ్యాడు... తిరిగి ఆమెతోనే బ్రహ్మచారిపై మరో కేసు పెట్టించాడు... అంతకు ముందే బ్రహ్మచారిని హత్య చేయిస్తానని ఇతర ట్రాన్స్‌జెండర్స్‌కు చెప్పాడు.. ఇదే.. విషయాన్ని జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తన పాత స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్నాడు. అప్పటికే స్వాతి సైతం కనిపించపోయి శ్రీనివాస్‌తో కలిసి ఉంటుందని బావించిన బ్రహ్మచారి, శ్రీనివాస్ తనను మోసం చేశాడని ఆగ్రహించాడు.. స్నేహితులతో కలిసి ఆయన్ను ఖతం చేసేందుకు ప్లాన్ వేశారు...
Double Marriage : ఒకే జంట.. పిల్లలకు ముందు ఓసారి .. ఆ తర్వాత మరోసారి.. !
మద్యం తాగించి హత్య..తల, మొండెం వేరు చేశారు..
మద్యం తాగించి.. నవంబర్ 12న నరేష్, బ్రహ్మచారి, రాజమ్మ కలిసి శ్రీనివాస్‌ని మట్టుబెట్టాలని చూశారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కారులో బయలుదేరారు. మెట్రోలో మద్యం సేవించారు...అనంతరం కారులో బయలు దేరారు.. ఔటర్ పక్కన ఆటవీ ప్రాంతం వద్దకు రాగానే.. కారులో కూర్చున్న శ్రీనివాస్ మెడకు వెనక సీటు నుంచి బ్రహ్మచారి క్లచ్‌వైర్ బిగించాడు. నరేష్, రాజమ్మ కాళ్లూ చేతులు పట్టుకున్నారు.
ఇక శ్రీనివాస్ చనిపోయిన్నట్టు నిర్ధారించుకున్న ముగ్గురు స్నేహితులు.. మృతదేహాన్ని ఆడవిలోపలికి తీసుకెళ్లాలు తల, మొండెం వేరు చేశారు.. ఆతర్వాత మొండాన్ని, గుంత తవ్వి కప్పేశారు.తలను తీసుకెళ్లిన నరేష్ ఎక్కడో పాతిపెట్టాడు. అయితే.. అయితే.. బ్రహ్మచారి పాత కేసులో అరెస్టు కాగా ఎల్‌బీనగర్ పోలీసుల విచారణ చేపట్టారు.. ఇందులో భాగంగానే నేరం ఒప్పుకున్నాడు. ఇలా హత్య జరిగిన 45 రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పాతి పెట్టిన శ్రీనివాస్ మొండాన్ని బయటకు తీశారు. పంచనామా అనంతరం తిరిగి పూడ్చివేశారు. బ్రహ్మచారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా నరేష్, రాజమ్మ పరారీలో ఉన్నట్లు ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. కాగా శ్రీనివాస్ హత్య కేసులో ఓ పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.