రాత్రైతే చాలు అతనలా మారిపోతాడు.. భయంతో వణికిపోతోన్న ప్రజలు

ప్రతీకాత్మక చిత్రం

కమ్మరి రాజు తీరుతో గ్రామస్తులు వణికిపోతున్నారు. ఎక్కడ తమ చిన్నారులను కూడా ఎత్తుకెళ్లి రక్తం తాగుతాడేమోనని భయపడిపోతున్నారు. దీనిపై గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు.

  • Share this:
    మనిషిలోని కొన్ని అపసామాన్య కోణాలు భయం కలిగిస్తుంటాయి. మానవ మనో వికారాలకు పరాకాష్టగా కనిపించే కొన్ని ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వనపర్తి జిల్లా సింగంపేటకు చెందిన కమ్మరి రాజు. రాత్రి అయిందంటే చాలు.. రాజుకు పచ్చి నెత్తురు తాగడం అలవాటు. ఇందుకోసం చుట్టుపక్కల ఇండ్లలోని పశువులను ఎత్తుకెళ్లి వాటి రక్తం తాగుతుంటాడు. ఆపై వాటిని తీసుకొచ్చి సదరు యజమానుల ఇంటిముందు పడేస్తాడు. అలా ఇప్పటివరకు 60 మూగజీవాల నెత్తురు తాగాడు.

    కమ్మరి రాజు తీరుతో గ్రామస్తులు వణికిపోతున్నారు. ఎక్కడ తమ చిన్నారులను కూడా ఎత్తుకెళ్లి రక్తం తాగుతాడేమోనని భయపడిపోతున్నారు. దీనిపై గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో అతన్ని మానసిక రోగుల ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించినట్టు సర్పంచ్ విజయలక్ష్మి తెలిపారు.10వ తరగతి వరకు చదువుకున్న రాజుకు.. ఇలా ఎందుకు మారిపోయాడో ఎవరికీ అంతుచిక్కడం లేదన్నారు.


    Published by:Srinivas Mittapalli
    First published: