పెళ్లికూతురు కిడ్నాప్... సినిమా రేంజ్‌లో హైడ్రామా... ఏం జరిగిందంటే...

రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటనలో గాయపడిన బాధితుల్ని సింధారీ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రధాన నిందితుడు జలమ్ సింగ్, అతని సోదరుడు గోపాల్ సింగ్ పరారీలో ఉన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 1, 2019, 2:57 PM IST
పెళ్లికూతురు కిడ్నాప్... సినిమా రేంజ్‌లో హైడ్రామా... ఏం జరిగిందంటే...
ఎప్పుడూ రమ్య వద్దే ఉంటూ కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్య కడుపు మండింది. వారిద్దరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని నిర్ణయించింది. ఓ రోజు తన భర్త రమ్య ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
  • Share this:
రాజస్థాన్... జైసల్మేర్‌లో జరిగిందీ ఘటన. బార్మెర్ జిల్లాలోని... బాటా గ్రామంలో... ఆ ఫ్యామిలీ... తమ కూతురి పెళ్లి హడావుడిలో ఉంది. ఇంతలో అరివీర భయంకరుల్లా వచ్చిన... జలమ్ సింగ్, అతని సోదరుడు గోపాల్ సింగ్, మరో బంధువు ఈశ్వర్ సింగ్ కలిసి... పెళ్లికూతుర్ని ఎత్తుకుపోయారు. వాళ్ల నుంచీ ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన వాళ్లను... జలమ్ సింగ్ అనుచరులు చితకబాదారు. సినిమాల్లో ఫైట్ సీన్ లాంటిది అక్కడ జరిగింది. చూస్తుండగానే అమ్మాయిని ఎత్తుకుపోయారు. స్థానికులు చెబుతున్నదేంటంటే... ఆ కుర్రాడికీ, ఆ వధువుకీ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. కానీ దాన్ని రద్దు చేసుకున్నారు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు. ఆమెను జాసోల్‌కి ఎత్తుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లికూతురు తండ్రి ఇచ్చిన కంప్లైంట్‌తో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ జోరుగా కొనసాగుతోంది. నిందితులపై ఐపీసీ సెక్షన్ 323, 341, 365, 364A, 382 కింద కేసులు నమోదయ్యాయి.

పెళ్లికూతురు నర్పత్ సింగ్... స్థానిక నాగర్ గ్రామానికి చెందినది. ఆమె సోదరుడు గణపత్ సింగ్. ముందుగా జలమ్‌ సింగ్‌కి ఆమెను ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నారు. అందుకోసం నిశ్చితార్దం జరపాలనుకున్నారు. జలమ్ సింగ్ గురించి ఎంక్వైరీ చేసి... అతడు తమ అమ్మాయికి సరైన వాడు కాదని అనుకున్నారు. వెంటనే నిశ్చితార్థం రద్దు చేసుకొని... వేరే యువకుడితో పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జలమ్ సింగ్... ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు. ఫలితమే పైన జరిగిన కిడ్నాప్ ఎపిసోడ్. ఇప్పుడు వధువు ఎక్కడుందో తెలియదు. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నా... ఎక్కడికి ఎత్తుకుపోయిందీ క్లూ దొరకట్లేదు.

చెన్నైలో మరో కిడ్నాప్ : ఇలాగే... చెన్నైలో మరో రకమైన ఘటన ఫిబ్రవరిలో జరిగింది. పెళ్లి కూతురు తండ్రే... ఆమెను కిడ్నాప్ చేశాడు. వధువు శుభశక్తి... సతీష్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అతనితో 8 ఏళ్లుగా డేటింగ్ కూడా చేస్తోంది. రెండు కుటుంబాలకూ వాళ్ల పెళ్లి ఇష్టం లేదు.

సింగపూర్ నుంచీ వచ్చిన సతీష్... శుభశక్తి తల్లిని పెళ్లి విషయంలో ఒప్పించగలిగాడు. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. అంతలోనే... ఇలా కాదులే... తిరునాగేశ్వరంలో వేద మంత్రాలతో పెళ్లి చేసుకుందురు గాని అంటూ... రెండు వైపుల కుటుంబాలూ ఒక మాటపైకి వచ్చాయి. హమ్మయ్య అనుకున్నారు వధూవరులు.

తీరా పెళ్లి రోజున మంటపానికి పెళ్లి కూతురు రాలేదు. ఏం జరిగిందా అని ఆరా తీస్తే... ఆమె తండ్రో ఆమెను కిడ్నాప్ చేశాడని తెలిసింది. వరుడు కుంభకోణం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. వధువు తల్లిదండ్రులు ఆమెను దాచేసి, నాటకాలాడుతున్నారని ఆరోపించాడు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆమె ఎక్కడుందో, అసలు ఉందో, లేదో కూడా తెలియట్లేదు.
Published by: Krishna Kumar N
First published: August 1, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading