హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో రేవ్ పార్టీ భగ్నం... బూతులు తిడుతూ యువతుల రచ్చ...

వీడియో తీస్తున్న మీడియా వారి మీద యువతులు దాడి చేశారు. మీడియా ప్రతినిధులను బూతులు తిడుతూ వారి సెల్ ఫోన్లు, కెమెరాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు.

news18-telugu
Updated: January 12, 2020, 10:44 PM IST
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో రేవ్ పార్టీ భగ్నం... బూతులు తిడుతూ యువతుల రచ్చ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 20 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. జూబ్లిహిల్స్, బంజారా హిల్స్ పోలీసులు కలసి ఈ ఆపరేషన్‌ను సంయుక్తంగా నిర్వహించారు. అయితే, ఈ ఆపరేషన్‌ను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధుల మీద యువతులు దాడికి ప్రయత్నించారు. వారి కెమెరాలు లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. వీడియో ఎందుకు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూబ్లిహిల్స్‌లోని ఓ పబ్ నుంచి భారీగా శబ్దాలు రావడం, డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతో స్థానికులు కొందరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. దీంతో జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఎక్సైజ్ పోలీసులు కలసి దాడి చేశారు. పోలీసులు పబ్ మీద దాడి చేసిన సమయంలో సుమారు 60 మంది నుంచి 80 మంది సభ్యులు ఉన్నట్టు తెలిసింది. పోలీసులు లోపలకు వెళ్లి చూడగా సుమారు 20 మంది యువతులు కనిపించారు. వారంతా కలసి అక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు భావించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.

యువతులను పోలీస్ స్టేషన్‌కు తరలించే సమయంలో వారి ముఖాలను క్లాత్‌తో చుట్టేశారు. అయితే, ఈ ఘటనను వీడియో తీస్తున్న మీడియా వారి మీద యువతులు దాడి చేశారు. మీడియా ప్రతినిధులను బూతులు తిడుతూ వారి సెల్ ఫోన్లు, కెమెరాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు