Rate Chart For Crime: కొట్టాలంటే ఐదు వేలు..! చంపాలంటే రూ.55 వేలు..!! నేర సేవలకు రేట్లట..

సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతున్నది. ప్రభుత్వాలు నేరాలను అరికట్టడానికి ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. బంగారు భవిత ఉన్న యువత సైతం.. నేరాలను వృత్తి గా మార్చుకుంటున్నారు. యూపీకి చెందిన ఒక యువకుడు నేరాలు చేయడానికి రేట్లను కూడా నిర్ణయించాడు.

news18
Updated: November 6, 2020, 7:47 AM IST
Rate Chart For Crime: కొట్టాలంటే ఐదు వేలు..! చంపాలంటే రూ.55 వేలు..!! నేర సేవలకు  రేట్లట..
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: November 6, 2020, 7:47 AM IST
  • Share this:
‘ఎవరికైనా ధమ్కీ ఇయ్యాల్నా..! కౌంటర్ లో రూ.10 వేలు కట్టు. ఎవరిదైనా బెండు తీయాల్నా..! అయితే రూ. 20 వేలు కట్టు. కాలో చేయో తీసేయాలా..? రూ. 30 వేల ఖర్చవుద్ది..! ఏకంగా లేపేయ్యాలా..? అయితే కౌంటర్ లో యాభై వేలు కట్టెళ్లు.. నీ పనైపోతుంది..!’ అదేంటి నేరాలను అరికట్టాల్సింది పోయి నేరాలను ప్రోత్సహించేవిధంగా వ్యవహరిస్తున్నారనుకుంటున్నారా..? ఆగండాగండి. ఇవన్నీ మా సేవలు కాదు. యూపీలో ఒక వ్యక్తి ‘నేర సేవలు’ అందించడానికి ఏర్పాటు చేసుకున్న రేట్లు. ఈ చార్టును ఏకంగా ఇంటి గోడల మీద అతికించేశాడా యువకుడు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? మీ అనుమానం అక్షరాలా నిజం. నేరాలకు నిలయంగా మారిన ఉత్తరప్రదేశ్ లో. అసలు విషయం ఏమిటంటే..

పాత తెలుగు సినిమాలలో ఒక డెన్ ఉంటుంది. అందులోకి వెళ్లగానే మొత్తం చీకటి. చిన్నగా దీపమో.. లాంథరో వెలుగుతుంటుంది. పెద్ద పెద్ద మీసాలు.. ముఖం మీద కత్తి గాట్లు.. మాసిన గడ్డం.. మోకాలిపైదాకా లుంగీలు వేసుకుని క్రూరంగా చూసే రౌడీలు.. అక్కడికెళ్లి ఏదైనా అడగాలంటే.. వారు పైన చెప్పిన విధంగానే సమాధానమిస్తారు. అక్కడకు వచ్చినవాడు తన సమస్య ఇదని చెప్పకముందే.. వారి ఏ ఏ విభాగాలలో సేవలందిస్తున్నారో ఏకరువు పెడతారు. చిన్న చిన్న విషయాలకైతే అసిస్టెంట్లే డీల్ చేస్తారు. కానీ చంపుకోవడాలు, కొంచెం కాస్ట్లీ మర్డర్ అయితే అసలు విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇంత సెటప్, డ్రామా లేకున్నా.. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ కు చెందిన ఒక యువకుడు తాను అందించబోయే అమూల్యమైన ‘నేరసేవల’ రేట్లు ఫిక్స్ చేశాడు. అందుకు సంబంధించిన రేట్ చార్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముజఫర్నగర్ కు చెందిన ఆ యువకుడు.. తాను సమస్యలను పరిష్కరిస్తానని.. అయితే వాటికి ఫీజు తీసుకుంటానంటూ వేసిన పోస్టర్ స్థానికంగా కలకలం రేపగా.. సోషల్ మీడియాలో వైరలైంది. ఎవరినైనా బెదిరించడానికి వేయి రూపాయలు.. కుల్లబొడవాలంటే రూ. 5 వేలు.. కాలో, చేయో తీసేయాలంటే రూ. 10 వేలు వసూలు చేస్తానని ప్రకటించాడు. ఇక ఏకంగా మనిషి ప్రాణాలు తీయాలంటే మాత్రం కొంచెం ఎక్కువే ఖర్చౌవుతుందండోయ్.. దానికి రూ. 55 వేలు ఛార్జ్ చేస్తున్నాడు.

ఈ రేట్ చార్ట్ ల విషయం ఆ నోటా ఈ నోటా పాకి పోలీసుల దాకా చేరింది. దీంతో వాళ్లు దీనిమీద దృష్టి సారించారు. జిల్లాలని చరత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌకడ గ్రామానికి చెందిన యువకుడే ఇదంతా చేస్తున్నాడని గుర్తించారు. అతడిని పట్టుకుని కటకటాల వెనక ఉంచారు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సదరు యువకుడి తండ్రి యూపీలో పీఆర్డీ జవాన్ (హోం గార్డు) గా పనిచేస్తుండటం గమనార్హం. కాగా, సదరు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
Published by: Srinivas Munigala
First published: November 6, 2020, 7:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading