పెద్దాయనను కరిచిన ఎలుక. బాధితుడి మృతితో తీవ్ర కలకలం

పెద్దాయనను కరిచిన ఎలుక (ప్రతీకాత్మక చిత్రం)

ఎలుక కరిస్తే ఎవరైనా చనిపోతారా అనే డౌట్ మనకు ఉంటుంది. ఎలుకల వల్ల ప్లేగు వ్యాధి వస్తుంది. కానీ అతనికి ప్లేగు రాలేదు. కానీ చనిపోయాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం.

 • Share this:
  అది మహారాష్ట్ర... ముంబై (Mumbai)లోని రాజావాడీ ఆస్పత్రి... అక్కడికి ఓ పెద్దాయనను ఆయన కొడుకు హడావుడిగా తీసుకొచ్చాడు. క్రిటికల్ కండీషన్ సార్ అని చెప్పాడు. ఆ పెద్దాయనకు ఓ కన్ను కొరికేసినట్లుగా ఉంది. రక్తం కారుతూనే ఉంది. ఏమైందని డాక్టర్లు (doctors) అడిగితే... ఎలుక (rat) అతని కన్నును కొరికేసిందని చెప్పాడు. షాకైన డాక్టర్లు... వెంటనే అతన్ని ఐసీయూలోకి తరలించారు. ఓ డాక్టర్ మాత్రం "అలా ఎలా జరిగింది... అసలు ఎలుక కొరుకుతుంటే అతనేం చేస్తున్నాడు" అని అడిగారు. దాంతో కొడుకు... వివరంగా ఆ డాక్టర్‌కు అసలు విషయం చెప్పాడు.

  ఆ రాత్రి అలా జరిగింది:
  పెద్దాయన పేరు సురేష్ సాల్వే (suresh salve). రైల్వే ఉద్యోగి. దోంబీవాలీలోని తక్కుర్లీలో ఉన్న రైల్వే కాలనీలో ఉంటున్నాడు. ఆ కాలనీని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత రైల్వే అధికారులదే. కానీ అది అంత గొప్పగా ఏమీ ఉండదు. ఏడ్చినట్లు ఉంటుంది. కాబట్టి ఎలుకలకు అది బాగా నచ్చింది. అక్కడ ఎలుకలు పెద్ద పెద్ద కాలనీలు ఏర్పాటు చేసుకొని హాయిగా జీవిస్తున్నాయి. వాటిలో ఓ ఎలుక... బుధవారం రాత్రి సాల్వే నిద్రపోతుంటే అతని కన్నును గట్టిగా కొరికేసింది. అతనికి మెలకువ వచ్చేసరికే... కంటికి కన్నం పెట్టేసింది ఆ బండ ఎలుక.

  అతను నిద్రలేచి చూస్తే ఎలుక పారిపోయింది... కంటి నుంచి రక్తం కారుతుంటే... షాకయ్యాడు. లైట్ వేసి... పక్కనే గోడకు వేలాడుతున్న అద్దంలో చూసుకుంటే... కంటికి గాయం అయినట్లు కనిపించింది. దాన్ని చూడ్డంతోనే కళ్లు తిరిగి పడిపోయినట్లు అయిపోయాడు. గట్టిగా అరుస్తూ... ఏం జరిగిందో చెబుతూ స్పృహ తప్పాడు. అతని కొడుకు అతన్ని కళ్యాణ్‌లోని రైల్వే ఆస్పత్రి (railway hospital)కి తరలించాడు.

  డాక్టర్ల వెర్షన్:
  డాక్టర్లు ట్రీట్‌మెంట్ చేస్తుండగా... సురేష్ సాల్వే చనిపోయాడు. ఐతే... అతను ఎలుక కొరకడం వల్ల చనిపోలేదనీ... కాలేయం పాడవ్వడం (Liver Damage) వల్ల చనిపోయాడని రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టును మృతుడి బంధువులు నేలకేసి కొట్టారు. ఎలుక వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాక్టర్లేమో.. అతను బాగా మద్యం తాగేవాడనీ... అందువల్లే అతని లివర్ పాడైపోయిందనీ.. ఆల్రెడీ అతనికి లివర్ ట్రీట్‌మెంట్ కొన్నాళ్లుగా జరుగుతోందనే విషయాన్ని చెప్పారు. అయినా సరే మృతుడి బంధువులు ఒప్పుకోలేదు.

  ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ చెవిలో సెక్స్ చేశాడు.. చివరకు ఇలా అయ్యింది

  "ఆ రైల్వే కాలనీకి ఓసారి వెళ్లి చూడండి... ఎంత చండాలంగా ఉంటుందో... మీకేం తెలుసు... ఆస్పత్రిలో డాక్టర్లు కాబట్టి మీకు నిజం తెలియదు. మాకు తెలుసు. వాణ్ని ఎలుక అలా కొరికేసింది కాబట్టే చనిపోయాడు. దీనికి రైల్వే అధికారులదే బాధ్యత... మాకు రైల్వే అధికారులు న్యాయం చెయ్యాల్సిందే" అని అంటున్నారు. ఇప్పుడీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రైల్వే కాలనీలోని చాలా మంది అది లేదు, ఇది లేదు... పరిశుభ్రత లేదు అంటూ ఆందోళన చేస్తున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: