రాష్ట్రపతి భవన్ స్టాఫ్ క్వార్టర్స్‌లో యువతిపై అత్యాచారం

ఢిల్లీకి చెందిన ఎమ్మెస్సీ స్టూడెంట్ మీద రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

news18-telugu
Updated: April 10, 2019, 8:37 PM IST
రాష్ట్రపతి భవన్ స్టాఫ్ క్వార్టర్స్‌లో యువతిపై అత్యాచారం
రాష్ట్రపతి భవన్ (Reuters)
news18-telugu
Updated: April 10, 2019, 8:37 PM IST
రాష్ట్రపతి భవన్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు ఇండియాటుడే కథనాన్ని ప్రచురించింది. ఢిల్లీకి చెందిన ఎమ్మెస్సీ స్టూడెంట్ మీద రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే ఉద్యోగి అత్యాచారం చేశాడు. నిషాంత్ యాదవ్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంగళవారం రాత్రి తనపై లైంగికదాడి చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రపతి భవన్‌ స్టాఫ్ క్వార్టర్స్‌కు తనను పిలిచి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు నిషాంత్ యాదవ్ పరారీలో ఉన్నట్టు తెలిసింది.

First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...