అనంతపురం జిల్లా ఎర్రనేల కొట్టాలలో దారుణం జరిగింది. మహేశ్వరి అనే వివాహితపై రష్మీ అనే మహిళ హత్యాయత్నానికి పాల్పడింది. బ్లేడుతో ఆమె గొంతు కోసి పరారైంది. పెళ్లికి ముందు మహేశ్వరి భర్తతో రష్మీ ప్రేమాయణం నడిపింది. మహేశ్వరి వల్లే అతనితో తన పెళ్లి కాలేదని కక్ష పెంచుకుంది. ఇదే క్రమంలో ఆదివారం ఆమెపై బ్లేడుతో హత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఘటన అనంతరం మహేశ్వరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.