రేపిస్టుని కటకటాల్లోకి నెట్టిన పసికందు మృతదేహం...ఓ అబల కన్నీటి గాథ

బాధితురాలు 7వ నెలలోనే ప్రసవించడంతో పుట్టిన మగబిడ్డ మృతి చెందాడు. శిశువును సేకరించిన టిష్యూ ద్వారా పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలకు పంపగా, శిశువు సునీల్‌, బాధితురాలికే జన్మించినట్లు రిపోర్టు వచ్చింది.

news18-telugu
Updated: October 12, 2019, 8:17 PM IST
రేపిస్టుని కటకటాల్లోకి నెట్టిన పసికందు మృతదేహం...ఓ అబల కన్నీటి గాథ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 12, 2019, 8:17 PM IST
ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ పట్టణంలోని మిర్చి కంపౌండ్‌కు చెందిన బాధితురాలు రోజు కూలీగా పని చేస్తుండగా, అదే కాలనీకి చెందిన సునీల్‌ లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. ఒకే కాలనీకి చెందిన వీరిద్దరూ పరిచయం కావటంతో అది కాస్తా ప్రేమగా మారింది. దాంతో నిందితుడు,   బాధితురాలితో తన లైంగిక వాంఛలు తీర్చుకొని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం బాధితురాలు అతడికి ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. దీంతో సునీల్‌ నిరాకరిస్తూ పరారయ్యాడు. దీంతో బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆమె గర్భవతిని తేలటంతో సునీల్‌పై ఐపీసీ 376 సెక్షన్‌ను జత పరిచి కేసు నమోదు చేశారు.

కాగా బాధితురాలు 7వ నెలలోనే ప్రసవించడంతో పుట్టిన మగబిడ్డ మృతి చెందాడు. శిశువును సేకరించిన టిష్యూ ద్వారా పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలకు పంపగా, శిశువు సునీల్‌, బాధితురాలికే జన్మించినట్లు రిపోర్టు వచ్చింది. అనంతరం సునీల్ ను అరెస్టు చేయగా, కేసు విచారణలో నిందితుడు చేసిన నేరం రుజువు అయ్యింది. దీంతో సునీల్‌ను మూడు సెక్షన్‌ల కింద ఏడేళ్ల జైలు, రూ. 600 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...