భార్య సాయంతో యువతిపై 13 సార్లు అత్యాచారం... పోలీసులు రాగానే వీల్‌ఛైర్‌లో కదల్లేని...

వీల్‌‌ఛైర్ మీద కనీసం కదల్లేని స్థితిలో ఉన్నట్టుగా నాటకాలు... భార్య సాయంతో యువతిపై పలుమార్లు అత్యాచారం చేసి... కోర్టును కూడా నమ్మించిన కిలాడీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 8:14 PM IST
భార్య సాయంతో యువతిపై 13 సార్లు అత్యాచారం... పోలీసులు రాగానే వీల్‌ఛైర్‌లో కదల్లేని...
భార్య సాయంతో యువతిపై అత్యాచారం చేసి... పోలీసులు రాగానే వీల్‌ఛైర్‌లో కదల్లేని...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 8:14 PM IST
అతనిపై రేప్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. అరెస్ట్ చేద్దామని వెళితే,అతన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. వీల్‌ఛైర్‌పైన కదల్లేని స్థితిలో ఉన్న అతను... రేప్ చేశాడంటే పోలీసులు నమ్మలేకపోయారు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన... ఇంగ్లండ్‌లో వెలుగుచూసింది. ఇంగ్లండ్ దేశంలోని నార్త్ ఆంబ్రియాకు చెందిన జార్జ్ స్టీఫెన్‌సన్ అనే వ్యక్తిపై 2015లో అత్యాచార ఆరోపణలు వచ్చాయి. తనపై జార్జ్ అత్యాచారం చేశాడని ఓ మహిళ, పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు స్వీకరించి, అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళితే... అక్కడ సీన్ చేసి దిమ్మతిరిగినంత పనైంది. వీల్‌‌ఛైర్ మీద కనీసం కదల్లేని స్థితిలో ఉన్నాడు జార్జ్ స్టీఫెన్‌సన్. భార్య సాయంతో బయటికి వచ్చాడు. అది చూసి కనీసం మాట్లాడకుండానే వెళ్లిపోయారు పోలీసులు. ఈ సంఘటన తర్వాత రెచ్చిపోయిన జార్జ్... అదే యువతిపై 13 సార్లు అత్యాచారం చేశాడు. ఆమె పోలీసులకు ఎంత మొత్తుకున్నా... వాళ్లు పట్టించుకోలేదు. ఎట్టకేలకు పక్కా ఆధారాలతో పోలీసులకు నిరూపించింది సదరు యువతి.

దాంతో అతన్ని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపర్చారు పోలీసులు. న్యాయమూర్తులు కూడా జార్జ్ పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ఇంత శారీరక వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తి, యువతిపై అత్యాచారం చేశాడంటే నమ్మలేకపోయారు. అయితే ఆధారాలు మాత్రం అతను అత్యాచారం చేసినట్టు బలంగా ఉన్నాయి. దాంతో ఏం చేయాలో తెలియక వాయిదాలు వేస్తూ కేసును కొనసాగించారు. ఎట్టకేలకు 2017 నవంబరులో అతని ఆరోగ్యం చాలా బాగుందని, ఎలాంటి వైకల్యం లేదని పక్కా ఆధారాలతో నిరూపించారు పోలీసులు. సొంతంగా కారు నడుపుకుంటూ రెస్టారెంటుకి వెళ్లి, అక్కడ బర్గర్ తింటూ ఎంజాయ్ చేయడం, ఆ తర్వాత ఇంటికి నడుచుకుంటూ వెళ్లడం వీడియోల్లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలన్నీ జడ్జి ముందుపెట్టడంతో ఆయన అవాక్కయ్యాడు. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా శారీరక వైకల్యం ఉన్న వ్యక్తిగా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేసిన జార్జ్‌కు 26 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. దాదాపు కేసు కొట్టివేసే సమయానికి బయటికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు జార్జ్. అతనికి సహకరించిన భార్యకు కూడా మూడేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...