Bangalore Gangrape : బెంగళూరులో దారుణం జరిగింది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ యువతి.. బెంగళూరులో సర్వీసులు అందిస్తున్న ర్యాపిడో సంస్థకు చెందిన బైక్ ఎక్కింది. ఆమెను ట్రాప్ చేసిన బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు ఆమెను గ్యాంగ్ రేప్ చేసినట్లు తెలిసింది. ఆమె వెళ్లాల్సిన వైపు బైకును నడపకుండా.. ట్రాఫిక్ జామ్ ఉందంటూ దారి మళ్లించిన డ్రైవర్.. ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిసింది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
బైక్ డ్రైవర్ బీహార్‌కి చెందిన షహబుద్దీన్, అతని స్నేహితుడు అహ్మద్ షరీబ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. వాళ్లిద్దరూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న యువతి తన స్నేహితుణ్ని కలిసేందుకు బైక్ ఎక్కగా.. అదే అడ్వాండేజ్గా షహబుద్దీన్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఘటన జరిగినప్పుడు షహబుద్దీన్ ప్రియురాలు కూడా ఆ ఇంట్లోనే ఉంది. ఘటన తర్వాత దీనిపై బాధితురాలు తన స్నేహితుడికి చెప్పగా.. అతను వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి.. రేప్ జరిగినట్లు తేల్చారు. పోలీసులు కేసు రాసి.. నిందితుల్ని అరెస్టు చేశారు.
ఈమధ్యే ర్యాపిడో సర్వీసులపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. సర్వీసుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ర్యాపిడో సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. కానీ.. ఇప్పుడు ఈ ఘటన జరగడంతో.. అసలు ర్యాపిడో బైక్ సర్వీసుల నుంచి కస్టమర్లకు రక్షణ ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఆ బైక్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు స్థానికంగా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.