ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం... బెయిల్‌పై విడుదలై, కన్నతల్లిని కూడా దారుణంగా...

మధురవాయిల్ హైవే మీద సగం కాలిన స్థితిలో చిన్నారి మృతదేహం... పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ... బెయిల్‌పై విడుదలై కన్నతల్లిని చంపేసిన నిందితుడు... ఉరిశిక్ష వేసిన మహిళా కోర్టు... శిక్ష అమలుపై సుప్రీం స్టే...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 9:28 PM IST
ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం... బెయిల్‌పై విడుదలై, కన్నతల్లిని కూడా దారుణంగా...
ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం... బెయిల్‌పై విడుదలై, కన్నతల్లిని కూడా దారుణంగా...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 9, 2019, 9:28 PM IST
తమళనాడు రాష్ట్రంలో సంచలనం క్రియేట్ చేసిన ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడు దశ్వంత్, తాత్కాలికంగా శిక్ష నుంచి తప్పించుకున్నాడు. 2017 ఫిబ్రవరి 5న చెన్నైలోని పోరూరు ఏరియాలోని మౌళవాక్కం మదనందపురంకు చెందిన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న బాబు, శ్రీదేవి దంపతులు ఏడేళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఏరియాల్లో వెతికిన తల్లిదండ్రులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులకు... నాలుగు రోజుల తర్వాత మధురవాయిల్ హైవే మీద సగం కాలిన స్థితిలో చిన్నారి మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో బాలికపై అత్యాచారం జరిగినట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేయాలని, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు జరిగాయి. పోలీసుల దర్యాప్తులో శ్రీదేవి దంపతులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే పై అంతస్థులో ఉంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్ దశ్వంత్... నిందితుడిగా తేల్చారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన దశ్వంత్... బాలికపై అతిక్రూరంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టి హత్య చేశాడని తేలింది. దశ్వంత్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతన్ని చంపేయాలని డిమాండ్లు వినిపించాయి. దశ్వంత్‌పై గుండా యాక్ట్ కూడా నమోదైంది. అయితే అన్యూహ్యంగా ఆరు నెలలకే బెయిల్ మీద బయటికి వచ్చిన దశ్వంత్... తండ్రి పలుకబడిని ఉపయోగించుకుని స్వేచ్ఛగా తిరిగాడు.

అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత కొడుకు చేసిన తప్పును గుచ్చి గుచ్చి చెబుతూ, అతన్ని ఇబ్బంది పెట్టింది తల్లి సరళ. బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుపడేది. దాంతో తల్లిపై కోపం పెంచుకున్న దశ్వంత్... బయటికి వెళ్లేటప్పుడు అడ్డు చెప్పిందని సరళను చంపేశాడు. కన్నతల్లిని చంపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కొన్నిరోజుల పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన దశ్వంత్‌ను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. దర్యాప్తులో దశ్వంత్‌పై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిరూపితం కావడంతో అతనికి ఉరిశిక్ష విధించడమే సరైనదని తీర్పు వెలువరించింది చెంగల్పట్టు మహిళా కోర్టు. అయితే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ దశ్వంత్, హైకోర్టును ఆశ్రయించాడు. దశ్వంత్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. అయితే తాజాగా క్షమాభిక్ష కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు దశ్వంత్. ఈ పిటిషన్‌ను స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం... ఉరిశిక్ష అమలును నిలుపుదల వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి పడిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం కనిపిస్తోంది.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...