గ్యాంగ్ రేప్.. ఒంటిపై దుస్తులు లేకుండా అర కి.మీ పరిగెత్తిన బాలిక..

Rajasthan Rape Incident : నిందితులు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే నిందితుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక సహాయం కోసం నగ్నంగా అరకిలోమీటరు వరకు పరిగెత్తింది.

news18-telugu
Updated: September 14, 2019, 10:42 AM IST
గ్యాంగ్ రేప్.. ఒంటిపై దుస్తులు లేకుండా అర కి.మీ పరిగెత్తిన బాలిక..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో అత్యాచార ఘటనలు నిత్యకృత్యం అయిపోయాయి. పసిపిల్లలు,వృద్దులు అన్న తేడా లేకుండా కామాంధులు స్త్రీలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని భీల్‌వాడాలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా ఆమె వీధుల్లో పరిగెత్తింది. రాజస్తాన్‌లో సంచలనం రేపిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం బాధిత బాలిక ఆమె సోదరుడు,స్నేహితుడుతో కలిసి గుడికి బయలుదేరింది. మార్గమధ్యలో ముగ్గురు దుండగులు వారిని అడ్డగించారు. భయంతో సోదరుడు,స్నేహితుడు పారిపోగా.. బాలిక వారికి చిక్కింది. దీంతో బలవంతంగా ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లారు. ఈలోగా ఆమె సోదరుడు,స్నేహితుడు స్థానిక దుకాణదారు ఒకరికి విషయం చెప్పి.. అతన్ని సహాయం చేయమని కోరారు. ఆపై అతన్ని వెంటబెట్టుకుని తమను బెదిరించిన ప్రదేశానికి తీసుకెళ్లగా అక్కడ వాళ్లెవరు కనిపించలేదు.

మరోవైపు నిందితులు బాలికను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే నిందితుల బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక సహాయం కోసం నగ్నంగా అరకిలోమీటరు వరకు పరిగెత్తింది. గమనించిన స్థానికులు బాలికకు దుస్తులు అందించి విషయంపై
ఆరా తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పగిలిన గాజులు, మద్యం సీసాలు, రక్తపు మరకలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading