• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • RAPED 27 YEARS AGO AND WOMAN FILES RAPE CASE AGAINST TWO AFTER SON ASKS FATHER NAME SSR

Raped 27 Years Ago: 27 ఏళ్ల క్రితం ఆమెపై రేప్.. నాన్న పేరేంటని అడిగిన కన్నకొడుకుకు ఆమె సమాధానం ఇది..!

Raped 27 Years Ago: 27 ఏళ్ల క్రితం ఆమెపై రేప్.. నాన్న పేరేంటని అడిగిన కన్నకొడుకుకు ఆమె సమాధానం ఇది..!

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తనపై 12 ఏళ్ల వయసులో అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై 27 సంవత్సరాల తర్వాత రేప్ కేసు పెట్టింది. ఆమె కొడుకు తన తండ్రి ఎవరిని అడగడంతో ఆమె ఈ కేసు పెట్టడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 27 ఏళ్ల క్రితం అంటే కేసు పెట్టిన మహిళ 12 ఏళ్ల వయసులో...

  • Share this:
    షాజహాన్‌పూర్ : ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తనపై 12 ఏళ్ల వయసులో అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిపై 27 సంవత్సరాల తర్వాత రేప్ కేసు పెట్టింది. ఆమె కొడుకు తన తండ్రి ఎవరిని, పేరేంటని అడగడంతో ఆమె ఈ కేసు పెట్టడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే.. 27 ఏళ్ల క్రితం అంటే కేసు పెట్టిన మహిళ 12 ఏళ్ల వయసులో తన అక్క, బావతో కలిసి ఉండేది. ఆమె అక్క, బావ ఇంట్లో లేని సమయంలో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండగా పొరుగింట్లో ఉండే నక్కి హసన్ అనే ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది చూసిన నక్కి హసన్ సోదరుడు గుడ్డు కూడా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించి హసన్, అతని సోదరుడు గుడ్డు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇలా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి వారి లైంగిక వాంఛ తీర్చుకున్నారు. 13 సంవత్సరాల వయసులో ఆమె గర్భం దాల్చింది. 1994లో ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.

    ఈ క్రమంలోనే.. ఆమె బావకు రాంపూర్‌కు బదిలీ కావడంతో ఆ బిడ్డను ఆమె సొంతూరైన ఉద్ధంపూర్‌లో ఒకరికి దత్తత ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్నేళ్ల తర్వాత బాధిత మహిళకు వివాహం జరిగింది. అయితే.. ఆమెపై ఇలా అత్యాచారం జరిగినట్లు, ఆమెకు ఓ బిడ్డ పుట్టినట్టు ఆమె భర్తకు తెలియదు. పెళ్లైన పదేళ్ల తర్వాత ఈ విషయం బయటపడటంతో ఆమె భర్త విడాకులిచ్చి వెళ్లిపోయాడు. దీంతో.. బాధిత మహిళ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సొంతూరైన ఉద్దంపూర్‌కు వెళ్లింది. ఆమె దత్తత ఇచ్చిన పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతని సొంత అమ్మనాన్న గురించి ఆరా తీశాడు. తన తల్లి పేరు తెలుసుకున్నాడు.

    ఆమె ఆ ఊరిలోనే ఉందన్న విషయం తెలుసుకున్న యువకుడు ఎట్టకేలకు కన్నతల్లిని కలిశాడు. తన తండ్రి ఎవరని, అతని పేరేంటని ఆమెను అడగటంతో కన్నీరుమున్నీరైన బాధితురాలు ఇన్నేళ్ల తర్వాత తనపై అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై కేసు పెట్టింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తునకు తొలుత కుదరదని చెప్పడంతో ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. దీంతో.. ఎట్టకేలకు పోలీసులు కేసు దర్యాప్తును మొదలుపెట్టారు. సదర్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఆ యువకుడి తండ్రి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు అతనికి డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు