అత్యాచార బాధితురాలిపై మరో అఘాయిత్యం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తున్న పోలీసులు

ఈ ఏడాది మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది.

  • Share this:
    రేప్ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు బయలుదేరిన 23 ఏళ్ల యువతిపై కొంతమంది దుండగులు దాడి చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు 70శాతం కాలిన గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. రేప్ కేసులో నిందితులే ఈ పని చేయించారని అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉనావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మొత్తం నలుగురు వ్యక్తులు యువతిపై దాడి చేశారని.. ఇందులో ముగ్గురిని ఇప్పటికే పట్టుకున్నామని.. మరొకరి కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.

    కాగా,ఈ ఏడాది మార్చిలో ఇద్దరు వ్యక్తులపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. అదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొంది.యువతి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదవగా.. ప్రస్తుతం రాయ్‌బరేలీ కోర్టులో విచారణ జరుగుతోంది. నిందితుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నిందితుడిని మాత్రం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఇదే క్రమంలో గురువారం ఆమె కోర్టు విచారణకు బయలుదేరగా.. గ్రామ శివారుల్లో దుండగులు ఆమెను అడ్డగించి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
    Published by:Srinivas Mittapalli
    First published: