Rape and murder: ఉపాధి పనులకు వెళ్లిన గిరిజన మహిళ.. గుట్టపై శవమై కనిపించింది.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Rape and murder: ఉపాధి హామీ పనులకు వెళ్లిన గిరిజన మహిళపై ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    మ‌హ‌బూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, ధర్మారం శివారు, సీతారాంపుర తండాకు చెందిన మోడు ఉష (18) ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రస్తుతం కాలేజీలు బంద్ కావడంతో ఇంటి దగ్గరే ఉంటుంది. నిరుపేద కుటుంబం అయిన వారి తల్లిదండ్రులకు చేదోడుగా ఉండేందుకు కరువు పనికి (ఉపాధి హామీ పనికి ) వెళ్తోంది. రోజూ మాదిరిగా ఆమె పనికి వెళ్లింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాజేష్ యువ‌తికి దారి మద్యలో కలిసి బండిపై తీసుకొని పక్కనే ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత గంట సేపటికి గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టల్లో తీవ్ర రక్తస్రావంతో అచేతంగా ఆమె పడిపోయి ఉందంటూ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గ్రామస్తులు ఆమె తండ్రికి సమాచారం అందించారు. అంతా గుట్టపైకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె చనిపోయి ఉండడం చూసి బోరున విలపించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

    అయితే అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రాజేష్ యువ‌తిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.  పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్ట‌మ్ కోసం మ‌హ‌బూబాబాద్ జిల్లా హాస్పిట‌ల్ త‌ర‌లించారు. యువ‌తి త‌ల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టామ‌న్నారు.
    అండగా ఉంటాం..
    మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం తండా ధర్మారం శివారు సీతారాంపుర తండాకు చెందిన గిరిజ‌న యువ‌తి(18) పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన నేరస్తున్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఉష మృతికి సంతాపం తెలిపిన‌ మంత్రి సత్యవతి రాథోడ్.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి దారుణాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థిని కుటుంబానికి అండగా ఉంటామని సత్యవతి రాథోడ్ భరోసా ఇచ్చారు. ఇలాంటి దారుణాలు జరగకుండా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతామన్నారు.
    Published by:Veera Babu
    First published: