యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు

పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన దారుణం ఇది. చట్టాలు ఎన్ని ఉన్నా, అమ్మాయిలకు సరైన రక్షణ ఉండట్లేదని మరోసారి రుజువైంది. ఏం చేస్తే, ఈ రేప్‌లకు అడ్డుకట్ట పడుతుందన్నది తేలట్లేదు. దేశంలో ప్రతీ అరగంటకూ ఓ అత్యాచారం జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 6:42 AM IST
యూనివర్శిటీలో గ్యాంగ్ రేప్, కర్ణాటకలో దుమారం... ఇద్దరు అరెస్టు
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 6:42 AM IST
కర్ణాటకలోని కులబర్గి జిల్లాలోని కడగంజిలో ఉన్న సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటకలో కలకలం రేగింది. ఆక్కడకు వచ్చిన పోలీసులు ఓ అమ్మాయి ఏడుస్తూ ఉండటం చూశారు. ఆమె చుట్టూ స్నేహితులు, తోటి విద్యార్థినులూ అండగా ఉన్నారు. ఏం జరిగిందని పోలీసులు అడిగితే, ఆ బాధితురాలు చెప్పిన విషయాలు షాక్ తెప్పించాయి. నందిని (పేరు మార్చాం) అదే యూనివర్శిటీలో ఫోర్త్ సెమిస్టర్ చేస్తూ, అక్కడి హాస్టల్‌లో ఉంటోంది. రాత్రి 7 గంటల టైంలో వంట అయ్యిందో లేదో తెలుసుకుందామని ఒంటరిగా మెస్‌కి వెళ్లింది. అది నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న హాస్టల్. మెస్ అరకిలోమీటర్ దూరంలో ఉంటుంది. మెస్‌లోకి వెళ్లిన నందినీ... వంట అయ్యిందా అని అడిగింది. ఇంకా అవ్వలేదు... ఏం కర్రీస్ కావాలి అంటూ... ఆమె దగ్గరకు వచ్చిన అనీల్... ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. రేప్ చెయ్యాలని చూశాడు. తీవ్ర పెనుగులాట జరిగింది. అతన్ని కాలితో తన్ని... మెస్‌లోంచీ బయటకు పరిగెత్తుకొచ్చింది. మెస్ బయట గురు అనే మరో యువకుడు ఉన్నాడు. మంచివాడిలా నాటకాలాడాడు. హాస్టల్‌ దగ్గర దింపుతానని వెంట బయలుదేరాడు. తీరా... కాస్త దూరం వెళ్లగానే... మృగంలా మీద పడ్డాడు. ఆమె నోరు నొక్కేసి పక్కనే తుప్పల్లోకి తీసుకెళ్లి... రేప్ చేశాడు.

ఇదీ పరిస్థితి. ఇక అమ్మాయిలకు రక్షణ ఎక్కడ ఉంది? ఎవర్ని నమ్మాలి? ఘటన తర్వాత ఇద్దరు కేటుగాళ్లూ పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి... ఇద్దర్నీ పట్టుకున్నారు. వాళ్లకు ఉరిశిక్ష వెయ్యాలని తోటి స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:కొత్త నాణేలు వచ్చేస్తున్నాయ్... 16న నమూనాల ఖరారు


ట్రంప్ ఎమర్జెన్సీ ప్రకటిస్తే ఏమవుతుంది? మెక్సికో గోడకూ, ఎమర్జెన్సీకి సంబంధమేంటి?
అంతరిక్షంలో అక్కడ ఏలియన్స్ ఉన్నారా? భూమివైపు వస్తున్న ఆ తరంగాలపై నాసా ఏం చెబుతోంది?

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...