ఫేస్ మాస్కుపై మత్తు మందు చల్లి....మైనర్ బాలికపై అత్యాచారం...దారుణం....

మత్తు మందు చల్లిన మాస్కు అని గుర్తించని మైనర్ బాలిక.. ఆ మాస్కు ను మొఖానికి తగిలించుకుంది. ఆ తర్వాత కాసేపటికే ఆమో స్పృహతప్పింది. అదే సరైన సమయంగా భావించిన ఆ కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు.

news18-telugu
Updated: September 8, 2020, 6:24 AM IST
ఫేస్ మాస్కుపై మత్తు మందు చల్లి....మైనర్ బాలికపై అత్యాచారం...దారుణం....
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త మోసాలతో కీచకులు అమ్మాయిలను చెరబడుతున్నారు. తాజాగా కరోనా మాస్కుపై మత్తు మందు జల్లి, బాలికకు ఇవ్వగా, అది ధరించిన బాలిక మత్తులోకి జారుకుంది.అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు ఆ కామాంధుడు. ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. దీంతో సర్వత్రా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో స్థానిక మైనర్ బాలికను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె ధఱించే మాస్కుపై మత్తు మందు చల్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. స్థానికంగా ఉండే ఓ లేబర్ కాంట్రాక్టర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు మందు చల్లిన మాస్కు అని గుర్తించని మైనర్ బాలిక.. ఆ మాస్కు ను మొఖానికి తగిలించుకుంది. ఆ తర్వాత కాసేపటికే ఆమో స్పృహతప్పింది. అదే సరైన సమయంగా భావించిన ఆ కాంట్రాక్టర్ ఆమెను బలాత్కరించాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పిన బాధితురాలు వణికిపోయింది.

అయితే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Published by: Krishna Adithya
First published: September 8, 2020, 6:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading