తెలంగాణలో మరో ఘోరం.. చిన్నారిని పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం

ఉదయం పంట పొలాల్లో ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆ బాలిక కన్నీరు పెట్టుకుంది.

news18-telugu
Updated: January 1, 2020, 5:58 PM IST
తెలంగాణలో మరో ఘోరం.. చిన్నారిని పొలాల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం వంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో ఘోరం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోణంపేటలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి తల్లి ఒడిలో నిద్రపోతున్న నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన దుండగుడు పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి.. చుట్టు పక్కల అంతా వెతికింది. ఐనా ఎక్కడా కనిపించలేదు. ఉదయం పంట పొలాల్లో ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఆ బాలిక కన్నీరు పెట్టుకుంది. ఘటనపై బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే గ్రామానికి చెందిన కొమురయ్య అనే దుండగుడు చిన్నారిపై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


First published: January 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు