Rape on girl : వరుసకు సోదరుడు.. కాని కూల్‌డ్రింక్ తాగివెళ్దాం అన్నాడు.. మత్తుమందు కలిపి..

Rape on girl : వరుసకు సోదరుడు.. కాని కూల్‌డ్రింక్ తాగివెళ్దాం అన్నాడు..

Rape on girl : వరసకు సోదరుడు అవుతాడని నమ్మింది. కాని ఆ నమ్మకమే.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది. వరుసకు సోదరుడైనా వెంట తీసుకుని వెళ్లాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెల్లి లైంగికంగా బలవంతం చేశాడు.

  • Share this:
    అత్యాచారాలు ( rape ) రోజురోజుకు పెరుగుతున్నాయి.. నమ్మిన వాళ్లే యువతులపై బలవంతపు అత్యాచారాలకు పాల్పడతున్నారు. కుటుంబ సంబంధాలు మంటగలిసేలా కొద్దిమంది వ్యవహరించడంతో కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తుండతో దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా నమ్మిన వారే తమ అఘాయిత్యాలకు పాల్పడడంతో మహిళల భద్రతపై ఆందోళన చెలరేగుతోంది.

    రాజస్థాన్‌లోని ( Rajastan ) జైపూర్‌లోని చాంద్‌పోల్ ప్రాంతానికి చెందిన ఓ 17ఏళ్ల యువతి వరుసకు సోదరుడైన మనీష్ గోత్వాల్‌తో కలిసి శనివారం గల్టా ధామ్ సందర్శించడం కోసం బయటకు వెళ్లింది. ఆ ప్రదేశమంతా చూశాకా అన్నా చెల్లెలిద్దరూ సాయంత్రం 6గంటలకు ఇంటికి బయలుదేరారు. కొంతదూరం వెళ్లాకా ఓ అటవీ ప్రాంతం దగ్గర సోదరుడు బైక్ ఆపాడు. 'అలసటగా ఉంది.. ఏదైనా కూల్‌డ్రింక్ తాగి వెళ్దాం'అని చెప్పాడు.

    ఇది చదవండి : చనిపోయిన శవానికి రెండు రోజులుగా పూజలు.. బతుకుందంటూ పోలీసులను బెదిరింపు.. !


    తనపై అన్నకు ఎంతో అభిమానం ఉందని ఆ చెల్లి సంబురపడింది. కానీ ఆ యువతి సోదరుడి దుర్భుద్ధి గమనించలేదు.ఎందుకంటే ఆ నీచుడు మత్తు పదార్థం కలిపిన ఓ పానీయంను తెచ్చి ఆ యువతికి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు.

     ఇది చదవండి : కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటి అయిన తీన్మార్ మల్లన్న భార్య.. కేసులపై లేఖ


    ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా.. కూతురిలో మానసిక ఆందోళన గమనించిన తల్లి ఏమైందని అడిగింది. దీంతో ఆ యువతి జరిగిన విషయం చెప్పింది. నీచుడికి శిక్ష పడాలని తల్లిదండ్రులు యువతిని తీసుకెళ్లి మొదటగా కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగిన గల్టా అటవీ ప్రాంతం.. గట్వా పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    Published by:yveerash yveerash
    First published: