HOME » NEWS » crime » RAPE ON 4 YEARS GIRL IN VIJAYANAGARAM DISTRICT NS

ఆడిస్తానంటూ తీసుకెళ్లి.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. ఏపీలో మరో దారుణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఆడిస్తానంటూ నాలుగేళ్ల పాపను తీసుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆ చిన్నారిపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

news18-telugu
Updated: November 27, 2020, 8:05 PM IST
ఆడిస్తానంటూ తీసుకెళ్లి.. నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం.. ఏపీలో మరో దారుణం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో చోటు చేసుకుంది. ఆడిస్తానంటూ నాలుగేళ్ల పాపను తీసుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆ చిన్నారిపై దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప కడుపునొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలానికి చెందిన ఓ యువకుడు(19) బుధవారం ఉదయం 11 గంటల సమయంలో తన పక్కింట్లో ఉండే ఓ చిన్నారిని ఆడిస్తానంటూ తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆ బాధిత చిన్నారి నానమ్మ ఇంటికి వచ్చింది.

ఆ బాలిక తనకు కడుపునొప్పిగా ఉందంటూ ఏడుస్తుండడంతో చికిత్స నిమిత్తం నానమ్మ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని నిర్ధారించారు. దీంతో బాధిత చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

చిన్నారులపై జరిగే లైంగికదాడుల్లో నిందితులు 99 శాతం తెలిసినవారే. ఈ విషయం నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)– 2019 రిపోర్టులో వెల్లడైంది. అయితే చిన్నారులపై జరిగే కొన్ని లైంగిక దాడులు వెలుగుచూడగా.. మరికొన్ని మాత్రం సమాజంలో ఏమనుకుంటారో అని మరుగును పడుతున్నాయి. తాజాగా ఓ బాలికపై వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన దారుణం మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
Published by: Nikhil Kumar S
First published: November 27, 2020, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading