భర్తలేని మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి...అత్యాచారం...

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. అతడి చేష్టలను ఆమె భ‌రించ‌లేక పోయింది. ఈ క్రమంలో ఆ కీచక బావ అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డిన వీడియోను తీసింది.

news18-telugu
Updated: June 30, 2020, 10:50 PM IST
భర్తలేని మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి...అత్యాచారం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భ‌ర్త‌ను పోగొట్టుకున్న తమ్ముడి భార్యకు అండ‌గా నిల‌వాల్సింది పోయి, ఆ మహిళ లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. వితంతురాలైన మరదలిపై అత్యాచారం చేశాడు. అత‌ని ఘాతుకాల‌ను భ‌రించ‌లేక‌.. బాధితురాలు తనపై జరుగుతున్న అత్యాచారాలను రహస్యంగా వీడియో తీసింది. దాన్ని పోలీసుల‌కు వాట్సప్ చేసింది. ఈ ఘ‌ట‌న వెస్ట్ బెంగాల్ లోని మిడ్నాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని మోహన్ న‌గ‌ర్‌కు చెందిన రీనా( పేరు మార్పు)కు మూడేళ్ల కింద‌ట పెళ్ల‌యింది. అత్తామామ‌, భ‌ర్తతో పాటు ఆమె మోహన్ న‌గ‌ర్‌లో నివ‌సిస్తోంది. ఎనిమిది నెల‌ల కింద‌ట ఆమె భ‌ర్త అనారోగ్యంతో మ‌ర‌ణించాడు. అత‌ను మ‌ర‌ణించిన కొద్దిరోజుల‌కే ఆమె బావ క‌న్ను రుక్సానాపై ప‌డింది. ఉద్యోగం ఇప్పిస్తానని న‌మ్మించి, ఆమెను మోసం చేశాడు. శారీర‌కంగా లోబ‌ర‌చుకున్నాడు.

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. అతడి చేష్టలను ఆమె భ‌రించ‌లేక పోయింది. ఈ క్రమంలో ఆ కీచక బావ అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డిన వీడియోను తీసింది. దాన్ని పోలీసుల‌కు అప్ప‌గించింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు. కేసు నమెదు చేశారు.
First published: June 30, 2020, 10:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading