news18-telugu
Updated: December 5, 2019, 2:51 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రకాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగింది. ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో గొంతు కోసి పరారయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల కథనం ప్రకారం.. కనిగిరిలోని ఓ ఆలయానికి సమీపంలో ఓ కుటుంబం నివసిస్తోంది. కొన్నేళ్లుగా వీరు తమ ఇంటి ముందు టెంకాయల షాపు నిర్వహిస్తున్నారు.
గురువారం టెంకాయల షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. టెంకాయలు కొనుగోలు చేసి డబ్బులు ఇచ్చారు. చిల్లర లేకపోవడంతో.. తీసుకొచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లారు. ఇదే అదునుగా ఆమె వెంటే వెళ్లిన ఆ ఇద్దరు తలుపులు మూసి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో కత్తితో గొంతు కోసం పారిపోయారు.సమీపంలోని సీసీటీవి ఫుటేజీలను పరిశీలించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Published by:
Srinivas Mittapalli
First published:
December 5, 2019, 2:51 PM IST