తెలంగాణలో ఘోరం.. బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత పెట్రోల్ పోసి..

బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాలిక వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది.

news18-telugu
Updated: February 29, 2020, 4:25 PM IST
తెలంగాణలో ఘోరం.. బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత పెట్రోల్ పోసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆడవారిపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. కఠిన చట్టాలు తెచ్చినా..ఉరిశిక్షలు పడుతున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం రాఘవాపురంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో బాలికను అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అనుకున్నట్లుగానే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాలిక వరంగల్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. నిందితుడిని వెంకటేష్‌గా గుర్తించిన పోలీసులు.. రెండేళ్లుగా ప్రేమ పేరుతో ఆ బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. ప్రేమను నిరాకరించడం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. పోక్సోచట్టం కింద కేసు పెట్టి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: February 29, 2020, 4:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading