Home /News /crime /

RAPE ATTEMPT ON A DUMB LADY IN GUNTUR DISTRICT SK

గుంటూరు జిల్లాలో దారుణం.. మూగ మహిళపై అత్యాచారయత్నం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పొలాల్లో గేదెలు కాస్తున్న మూగ మహిళపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు. మద్యం మత్తులో బలవంతం చేయబోయాడు.

    ఎన్ని చట్టాలు తెచ్చినా ఆగడం లేదు. ఎంత కఠిన శిక్షలు విధిస్తున్న మారడం లేదు. మహిళపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధ మహిళలను కూడా వదలిపెట్టడం లేదు కామాంధులు. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో దారుణం జరిగింది. ఇరుకుపాలెం గ్రామంలో పొలాల్లో గేదెలు కాస్తున్న మూగ మహిళపై దుండగుడు అత్యాచారయత్నం చేశాడు. మద్యం మత్తులో బలవంతం చేయబోయాడు. అతడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న మహిళ.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులుకు చెప్పి కన్నీళ్లు పెట్టింది. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Guntur, Rape attempt

    తదుపరి వార్తలు