• HOME
 • »
 • NEWS
 • »
 • CRIME
 • »
 • RAPE ATTEMPT AND MURDER ON SINGLE WOMEN NS

Crime: ఒంటిరి మహిళపై కన్నేసి.. భార్య సహాయంతోనే శవాన్ని కాల్చేసి..

Crime: ఒంటిరి మహిళపై కన్నేసి.. భార్య సహాయంతోనే శవాన్ని కాల్చేసి..

ప్రతీకాత్మక చిత్రం

Ananthapur: ఒంటరి మహిళపై అఘాయిత్యానికి యత్నించి.. లొంగకపోవడంతో చంపి, శవాన్ని కాల్చేసిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు.

 • Share this:
  ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా దేశంలో మహిళలపై దారుణాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న మహిళపై కన్నేసిన ఓ కీచకుడు ఆమె లొగకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా తన భార్య, మిత్రుడితో కలిసి శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అయితే మూడు నెలల అనంతరం అతడి పాపం పండడంతో పోలీసులకు చిక్కాడు. ఇందుకు సంబంధించిన వివరాలను నల్లమాడ సీఐ ఎస్‌.వి.నరసింహారావు బుధవారం ముదిగుబ్బ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్‌ కల్పనారెడ్డికి బత్తలపల్లి మండలం గుమ్మళ్లకుంటకు చెందిన వ్యక్తితో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. కొంత కాలం తర్వాత మనస్పర్ధలు రావడంతో భార్యాభర్తలు విడిపోయారు. దీంతో కల్పనారెడ్డి భర్త నుంచి విడిపోయి ధర్మవరంలో ఒంటరిగా ఉంటోంది. ఈమె చీరల కోసం చింతలరాయుడు అనే వ్యక్తికి చెందిన దుకాణానికి తరచూ వెళ్తూ ఉండేది. చీటీల విషయంలోనూ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. అయితే కల్పానారెడ్డి ఒంటరిగా ఉంటోందని తెలిసిన చింతలరాయుడు ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. ఇందుకు సరైన సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ వచ్చాడు.

  ఈ క్రమంలో జూన్ 29న లాక్‌డౌన్‌ జరుగుతున్న సమయంలో కల్పనారెడ్డి షాప్‌కు వచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడ చింతలరాయుడు తప్పా ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన అతను షాప్‌ మూసే సమయమైందంటూ ఆమెను లోపలే ఉంచి షట్టర్‌ వేశాడు. మంచి చీరలు చూపిస్తానంటూ లోపలి గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. తమ వారితో చెప్పి నీ అంతు చూస్తానని బెదిరించింది. దీంతో చింతలనాయుడు ఆమెను బయటకు వెళ్లనిస్తే తనకు ఇబ్బందులు తప్పవని భయపడ్డాడు. వెంటనే ఆమె వేసుకున్న స్కార్ఫ్, టవల్‌తో ముఖానికి గట్టిగా చుట్టాడు. ఊపిరి ఆడకుండా అదిమిపట్టి చంపేశాడు.

  తెల్లవారిన తర్వాత తన స్నేహితుడు జగదీష్‌, భార్యకు చింతలరాయుడు జరిగిన విషయం చెప్పాడు. తనపై కేసు రాకుండా ఉండాలని ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్లాన్ చేశాడు. మృతదేహాన్ని అట్టతో ప్యాక్ చేశాడు. అనంతరం ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ఘాట్‌లో ఉన్న కల్వర్ట్‌ కింద ఆ శవాన్ని పడేసి వెళ్లిపోయారు. శవాన్ని ఎవరైనా గుర్తుపడతారన్న భయంతో జూలై ఒకటో తేదీన మళ్లీ కల్వర్టు వద్దకు వెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టారు. జూలై ఐదున దొరిగిల్లుకు వెళ్లే దారిలోని కల్వర్టు కింద మహిళపై పెట్రోలు పోసి తగులబెట్టారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు.

  మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను మీడియా, సోషల్‌ మీడియా ద్వారా పరిశీలించిన ధర్మవరానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి ఆ కాలిన మృతదేహం తన కూతురు కల్పనారెడ్డిదని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసుల విచారణ మరింత వేగవంతమైంది. ఈ క్రమంలో తాము దొరికిపోతామని నిందితుడు చింతల రాయిడు, అతని భార్య హేమలత, స్నేహితుడు జగదీశ్ భావించారు. సెప్టెంబర్‌ 29న ముదిగుబ్బ పోలీసుల ఎదుట లొంగిపోయి, నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు చింతలరాయుడు, జగదీష్‌లు ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు, బాధితురాలు కల్పనారెడ్డి స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురు నిందితుల్ని బుధవారం రిమాండ్‌కు తరలించామని చెప్పారు.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు