Home /News /crime /

Supreme Court: విచారణ లేకుండా చార్జిషీటు ఫైల్ చేయొద్దు.. అత్యాచార కేసులపై సుప్రీం సంచలన తీర్పు

Supreme Court: విచారణ లేకుండా చార్జిషీటు ఫైల్ చేయొద్దు.. అత్యాచార కేసులపై సుప్రీం సంచలన తీర్పు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

అత్యాచార కేసులలో ఒక్క బాధితుల ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు ఫైల్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • News18
  • Last Updated :
    దేశంలో నిత్యం ఏదో ఓ చోట.. రేప్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం అత్యాచారాలకు గురికాకున్నా.. నిందితులపై కేసులు పెడుతున్నారు. వారిని పలు విధాలుగా బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఏకంగా వారిపై చార్జిషీట్ లు కూడా ఫైల్ అవుతున్నాయి. రోజూవారీ కేసులతో పాటు పోలీస్ స్టేషన్లలో ఇటువంటి కేసులు కూడా పెరగడంతో పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు దాఖలు చేయరాదని తీర్పునిచ్చింది.

    పూర్తి వివరాలిలా.. రేప్ కు గురైన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై చార్జిషీటు చేయరాదని, తగిన విచారణ చేపట్టిన తర్వాత.. అందుకు తగిన ఆధారాలు బయటపడితేనే వారిపై చార్జిషీటును నమోదుచేయాలని ఆదేశించింది. జస్టిస్ యు యు లలిత్, వినీత్ శరణ్, ఎస్ రవీంద్ర భట్ ల త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో పోలీసులు.. ఫిర్యాదుదారు ఫిర్యాదు ఆధారంగా ఛార్జిషీటు ఫైల్ చేశారు. యూపీలో ఒక ఆశ్రమం నడుపుతున్న చిన్మయానంద.. తనతో పాటు ఆశ్రమంలో ఉంటున్న చాలా మందిని లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసిన విషయం విదితమే. అయితే ఈ కేసులో చిన్మయానంద స్పందిస్తూ.. యువతి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నదనీ, రూ. 5 కోట్ల దాకా డబ్బులు డిమాండ్ చేస్తున్నదని ఆరోపించారు.

    కాగా, తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ.. నిందతుడిపై ఆధారాలు లేకుండా ఐపీసీ సెక్షన్ 164 కింద చార్జిషీటు దాఖలు చేయడానికి అర్హత లేదు. తగిన విచారణ చేపట్టి.. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉంటేనే చార్జిషీట్ ఫైల్ చేయాలని తెలిపింది.

    హత్రాస్ గ్యాంగ్ రేప్ మాదిరిగానే.. పలు అత్యాచార ఘటనల్లో మీడియా కవరేజీ.. హడావుడి ఆధారంగా నిందితులపై విచారణ చేపట్టకుండానే వారిపై కేసులు పెడుతుండటం, చార్జిషీటు దాఖలు చేస్తున్నారు. కాగా, చిన్మయానంద కేసుకు సంబంధించి కూడా.. ఈ కేసులో చిన్నయానంద ఆరోపిస్తున్నట్టు బాధితురాలు డబ్బును డిమాండ్ చేయడంపైనా విచారణ చేయాలని ఆదేశించింది. ఈ రెండు కేసులు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు