హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: యువతిపై అత్యాచారం.. కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న యువకుడు.. ట్విస్ట్ లు మాములుగా లేవుగా..

OMG: యువతిపై అత్యాచారం.. కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న యువకుడు.. ట్విస్ట్ లు మాములుగా లేవుగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: యువకుడు, ఒక యువతిని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య తరుపు బంధువులు యువకుడిని వేధింపులకు గురిచేశారు.

Girl molested Accused  Jumps From Haryana Court Building: హర్యానాలోని ఫరీదాబాద్ లో విచిత్ర ఘటన జరిగింది. సూరజ్ అనే యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈక్రమంలో అతను ఒక యువతిని అత్యాచారం చేశాడు. ఆ తర్వాత.. బంధువులు, పెద్దల మధ్య జరిగిన తప్పుకి పశ్చాత్తాపంగా అదే యువతిని పెళ్లి చేసుకున్నాడు.కానీ యువతి బంధువులు మాత్రం యువకుడిని మానసికంగా వేధించేవారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పుకొక పోవడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, జైలుకు తరలించారు.

కేసు వాపసు తీసుకొవాలంటే.. అతనికి మొదట, ₹ 5 లక్షలు, తర్వాత ₹ 10 లక్షలు అడిగారు. ఆలస్యంగా, వారు ₹ 15 లక్షలు అడిగారని తెలిపాడు. దీంతో అతను కలత చెందాడు. దీంతో అతను విచారణ సమయంలో కోర్టు ఆవరణలోని ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కాడు . అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని వైద్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. అయితే యువతిపై కానీ, ఆమె తల్లిదండ్రులపై కానీ ఫిర్యాదు చేయలేదని సూరజ్ తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది.

Bhubaneswar Youth extorts cash gold from minor girl..

ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలు, యువతులు వేధింపులకు గురౌతున్నారు. అసలు... అవతల వైపు ఉన్నది.. ఎవరో కూడా తెలియని వారు.. పంపిన రిక్వెస్ట్ లను యాక్స్ ప్ట్ చేసి ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు.  కొందరు దీన్ని ఒక బిజినెస్ గా చేస్తున్నారు. యువతుల డీపీలతో రిక్వెస్ట్ పెట్టి, హస్కీగా మాట్లాడించి, ఆ తర్వాత.. అవతలి వారిని ముగ్గులోనికి లాగుతున్నారు. వారి బలహీనతలను క్యాష్ చేసుకొని అందినకాడికి దోచుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు.

మరికొందరు పరిచయం చేసుకొని కొంత కాలం బాగా మాట్లాడి, ఆ తర్వాత.. న్యూడ్ కాల్స్ అంటూ విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు. కొంత మంది యువతులకు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టి ఆ తర్వాత.. వారి ఫోటోలను, వీడియోలను సంపాదించి వారిని వేధిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం ఒడిశాలో జరిగింది.

పూర్తి వివరాలు.. భువనేశ్వర్ పరిధిలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికకు.. దెంకనల్ జిల్లాకు చెందిన ఆశిష్ జెనా అనే యువకుడు ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పెట్టాడు. సదరు బాలిక దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత నంబర్ ను తీసుకున్నారు. కొన్ని రోజులు వీరిద్దరు కలుసుకున్నారు. ఆ సమయంలో వీరి ఫోటోలను అతను తీసుకున్నాడు. తర్వాత.. నిజ స్వరూపాన్ని బయట పెట్టాడు.

First published:

Tags: Crime news, Female harassment, Harassment, Haryana

ఉత్తమ కథలు