హోమ్ /వార్తలు /క్రైమ్ /

Newly Married: నెలన్నర క్రితమే ఇతనికి పెళ్లయింది.. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..

Newly Married: నెలన్నర క్రితమే ఇతనికి పెళ్లయింది.. ఇలా అవుతుందని కలలో కూడా ఊహించి ఉండడు..

రంజిత్ సెబాస్టియన్ (ఫైల్ ఫొటో)

రంజిత్ సెబాస్టియన్ (ఫైల్ ఫొటో)

ఆ యువకుడి వయసు 28 సంవత్సరాలు. నెలన్నర క్రితమే వివాహం జరిగింది. వృత్తి రీత్యా ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ.. అతనికి అన్నం పెడుతున్న ఆ ఆటో కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆ యువకుడు కలలో కూడా అనుకోలేదు.

కొట్టాయం: ఆ యువకుడి వయసు 28 సంవత్సరాలు. నెలన్నర క్రితమే వివాహం జరిగింది. వృత్తి రీత్యా ఆటోను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కానీ.. అతనికి అన్నం పెడుతున్న ఆ ఆటో కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆ యువకుడు కలలో కూడా అనుకోలేదు. ఈ విషాద ఘటన కేరళలోని కొట్టాయం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కురుప్పనంతర ప్రాంతానికి చెందిన రంజిత్ సెబాస్టియన్ అనే 28 ఏళ్ల యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ముత్తుచిరా మీట్ మార్కెట్ నుంచి రోజూ మాంసాన్ని కొట్టాయం, చంగనసేరి‌లోని హోటల్స్‌కు ఆటోలో డెలివరీ చేస్తుండేవాడు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు.

కొత్త కాపురం సంతోషంగా సాగిపోతుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అతనిని కబళించివేసింది. రోజూలానే హోటల్స్‌కు మాంసం డెలివరీ చేసి ఎత్తుమనూర్ వైపు రంజిత్ తిరిగి వెళుతుండగా కొట్టాయం వెళ్లేందుకు వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఆటోలో చిక్కుకున్న రంజిత్‌ను స్థానికులు, బస్సులోని ప్రయాణికులు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంజిత్‌ను బయటకు తీసి కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే.. అప్పటికే తీవ్రంగా గాయపడి రక్తం చాలా వరకూ పోవడంతో రంజిత్‌ను వైద్యులు కాపాడలేకపోయారు. రంజిత్ చనిపోయిన విషయం తెలిసి అతని భార్య సోనా కుప్పకూలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లింది.

ఇది కూడా చదవండి: Mother: కొడుకు సైకిల్ పోగొట్టుకుని అన్నం తినకుండా ఏడుస్తుంటే కన్న తల్లి ఏం చేసిందో చూడండి..

పోస్ట్‌మార్టం అనంతరం.. పోలీసులు రంజిత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 28 ఏళ్ల రంజిత్ అకాల మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కొట్టాయం గాంధీనగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. కూతురు, అల్లుడిని చూసి వంట సామాను గట్రా కొనిచ్చేందుకు రంజిత్ అత్తమామలు ఈ ప్రమాదం జరిగిన ముందు రోజే అతని ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఇలా జరగడం రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. పెళ్లయిన నెలన్నరకే రంజిత్ చనిపోవడంతో అతని భార్య భర్త శవంపై పడి గుండెలవిసేలా రోదించింది. వెక్కివెక్కి ఏడుస్తున్న రంజిత్ భార్యను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. కుటుంబ సభ్యులు రంజిత్ అంత్యక్రియలు నిర్వహించారు.

First published:

Tags: Crime news, Kerala, Newly Couple, Road accident

ఉత్తమ కథలు