చెత్త ఏరుకుంటూ రెక్కీ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లే అతడి టార్గెట్... కాజేసిన నగలను అమ్మి జల్సాలు

దొంగ వద్ద స్వాధీనం చేసుకున్న నగలను చూపుతున్న పోలీసులు

వీధుల్లో చెత్త ఏరుతూ.. ఎవరెవరు ఇంట్లో ఉండరో.. ఎవరెవరి ఇండ్లకు తాళాలు వేసి ఉంటాయో గమనిస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం, నగలు, నగదు.. ఏమున్నా ఊడ్చేస్తాడు. ఆ పైన దానిని అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు.

 • News18
 • Last Updated :
 • Share this:
  అతడు మధ్యాహ్నం సమయంలో చెత్త ఏరుకునే వాడిగా వీధుల్లోకి వస్తాడు. వీధుల్లో చెత్త ఏరుతూ.. ఎవరెవరు ఇంట్లో ఉండరో.. ఎవరెవరి ఇండ్లకు తాళాలు వేసి ఉంటాయో గమనిస్తాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వెళ్లి బంగారం, నగలు, నగదు.. ఏమున్నా ఊడ్చేస్తాడు. ఆ పైన దానిని అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. చాలాకాలంగా ఇదే అతడి వృత్తి. కానీ ఎన్నటికైనా పాపం పండాల్సిందే కదా. దొంగకు శిక్ష పడాల్సిందేగా.. పక్కా సమాచారం మేరకు గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ ఏరియాలో పోలీస్ సిబ్బంది సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని పోలీసులు గమనించారు. ఆ దొంగను పట్టుకొని సోదా చేయగా అతడి వద్ద బంగారు, వెండి ఆభరణాలు ఉండటంతో.. అదుపు లోకి తీసుకుని విచారించారు.

  రామగుండం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీపీసీకి చెంది ధరమ్ సోత్ మాన్ సింగ్ పని పాటా లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతడికి దొంగతనాలు అలవాటయ్యాయి. చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఎన్టీపీసీలో (02), గోదావరిఖని 1 టౌన్ లో (01), పాల్వంచ ఏరియా (13) దొంగతనాలు చేసి జైలుకి వెళ్లి వచ్చాడు. పలు మార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. రాకపోగా.. మళ్ళీ అదేవిధంగా దొంగతనాలు చేస్తున్నాడు.

  నిందితుడు తాను ఎంచుకున్న ప్రాంతంలో ముందు చెత్త ఏరుకున్నట్టు తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇండ్లను తన టార్గెట్ గా ఎంచుకుంటాడు. ఆ తర్వాత పగలు, రాత్రి సమయంలో ఆ ఇంటిలోకి వెళ్లి.. ఇనుప రాడ్ తో తలుపు తాళాన్ని పగుల గొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. దొంగతనం చేసిన సొత్తును అమ్మగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ పోలీసులకు దొరకకుండా తిరుగుతాడు. ఇదే క్రమంలో నిందితుడు తాను దోచుకున్న సొత్తు, బంగారాన్ని అమ్మడానికి ఈరోజు గోదావరిఖనికి వచ్చాడు.

  నిందితుడి నుండి 6.9 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 2,00,000 దాకా ఉంటుందని, అంతేగాక.. 40 తులాల వెండి ఆభరణాల విలువ రూ. 20,000 ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
  Published by:Srinivas Munigala
  First published: