Home /News /crime /

RAM JANKI TEMPLE SOLD OFF BY PAKISTANI NATIONAL IN UTTAR PRADESH PVN

Ram temple sold off: యూపీలోని రాముడి ఆలయాన్ని అమ్మిన పాకిస్తానీ..ఆలయాన్ని కూల్చి రెస్టారెంట్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ram Janki temple sold off : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్లు అధికారులు తెలిపారు.

Ram Janki temple sold off by Pakistani : ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కాన్పూర్ ప్రాంతంలోని బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని(Ram Janaki Temple) పాకిస్తానీ జాతీయుడు విక్రయించాడు. ఆలయంతో పాటుగా అనేక ఇతర ప్రాపర్టీలను కూడా అతడు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. అబిద్​ రెహ్మాన్ అనే వ్యక్తి 1962లో పాకిస్తాన్‌(Pakistan)కు వలస వెళ్లాడు, అక్కడ అతని కుటుంబం అప్పటికే నివసిస్తోంది. అయిత 1982లో తిరిగొచ్చిన అబిద్​ రెహ్మాన్ తన ఆస్తిని రామ్ జానకీ ఆలయ సముదాయంలో సైకిల్ రిపేర్ షాపును కలిగి ఉన్న ముఖ్తార్ బాబా అనే వ్యక్తికి విక్రయించాడు. ఆస్తిని కొన్న ముఖ్తార్​ అక్కడ నివసిస్తున్న 18 హిందూ కుటుంబాలను అక్కడి నుంచి తరలించి ఓ హోటల్​ను నిర్మించాడు. కాగా కాన్పూర్​ మున్సిపల్​ కార్పోరేషన్​ రికార్డుల ప్రకారం ఆస్తి ఆలయంగా నమోదు అయ్యింది. ఈ విషయంపై గతేడాది శత్రు సంపతి సంఘర్షణ సమితి అధికారులకు ఫిర్యాదు చేసింది. శత్రు సంపతి సంరక్షణ సంఘర్ష్ సమితి ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. శత్రు ఆస్తుల నిర్వహణ కార్యాలయం.... ఆలయాన్ని మరియు మరో రెండు ఆస్తులను 'శత్రువు' ఆస్తిగా చేర్చడానికి ప్రక్రియను ప్రారంభించింది.

ఇక,ఆలయాన్ని కొనుగోలు చేసి కూల్చివేసి హోటల్​ను నిర్మించిన వారికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. తాము అడిగిన ఐదు నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు రెండు వారాల సమయం ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదని శత్రు ఆస్తుల విభాగం అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ముఖ్తార్ బాబా కుమారుడు మెహమూద్ ఉమర్ తన వద్ద అవసరమైన అన్ని పేపర్లు ఉన్నాయని, నోటీసుపై త్వరలో స్పందిస్తానని పేర్కొన్నారు.

ALSO READ  Russia-Ukraine War : పెద్ద సంఖ్యలో రష్యాకు లొంగిపోయిన ఉక్రెయిన్ సైనికులు..ఇక యుద్ధం ముగిసినట్లేనా!

మరోవైపు, ఇప్పుడుదేశమంతా వారణాశిలోని జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid Case) గురించే చర్చ జరుగుతోంది. మసీదు ప్రాంగణలో ఉన్న బావిలో శివలింగం (Gyanvapi Shivling) లభ్యమవడం సంచలనం రేపుతోంది. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసిన మాజీ అడ్వకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా (Ajay Mishra Report) సిద్దం చేసిన నివేదికలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఛిన్నాభిన్నమైన దేవతల విగ్రహాలు, దేవాలయ శిథిలాలు, హిందూ నిర్మాణ శైలిలో చెక్కిన గోడలు వంటివి మసీదు లోపల కనిపించాయని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. సర్వే బృందం నుంచి కోర్టు ఆయన్ను తప్పించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసు గురువారం విచారణకు రానున్న నేపథ్యంలో, అజయ్ మిశ్రా సర్వే రిపోర్టులోని కీలక వివరాలను CNN-న్యూస్ 18 సంపాదించింది.మసీదు ప్రాంగణం (Gyanvapi mosque) లో బయటపడిన శివలింగాన్ని (Shiling) సంరక్షించాలని, అలాగే మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలను ఎప్పటిలాగే అనుమతించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అజయ్ మిశ్రా రిపోర్టుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మసీదు ప్రాంగణంలో వారు ఏమేం చూశారు? లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నయన్నదానిపై ఆసక్తి నెలకొంది. అందరూ భావించినట్లుగానే మసీదులో కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. కమలం ఆకారంతో పాటు నాలుగు హిందూ విగ్రహాలు, పూజా సామాగ్రి అవశేషాలు, అలాగే శేషనాగ్ అనే పౌరాణిక సర్పం ఇమేజ్.. వంటివి మసీదులో ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Ramatemple, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు