దిశ దోషి చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ

దిశ దోషి చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ

చెన్నకేశవుల్ని 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు

 • Share this:
  దిశ హత్యాచార ఘటన తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటన. ఈ ఘటనకు పాల్పడిన నలుగురు దోషుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఇటీవలే టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తానంటూ ప్రకటన చేశారు. అయితే తాజాగా ఆయన ఇవాళ దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. దీనిపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు  భార్య రేణుకను కలిశానన్నారు. అతడ్ని 16ఏళ్లకే రేణుక పెళ్లి చేసుకుందని.. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులోనే ఓబిడ్డకు జన్మనివ్వబోతుందని ట్వీట్‌ చేశారు. అతడు దిశతో పాటు... రేణుకను కూడా బాధితురాలిని చేశాడంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వాడు చేసిన వెదవ పనికి.. ఇప్పుడు భార్యతో పాటు... పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.

  దిశ నిందతుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం... హైకోర్టు కీలక ఆదేశాలు, High Court Order to Re-Postmortem For Disha Case Accused sb
  దిశ కేసులో నలుగురు దోషుల ఎన్‌కౌంటర్


  తాజాగా దిశ హత్యాచారం, దోషుల ఎన్‌కౌంటర్ ఘటనపై ఫోకస్ చేసాడు వర్మ. ఇది జరిగిన విధానం.. దోషులు మరణించిన విధానం చూసిన తర్వాత కచ్చితంగా ఎవరో ఒకరు సినిమా చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. చివరికి అది వర్మ అనౌన్స్ చేసాడిప్పుడు. తన నెక్ట్స్ సినిమా దిశ అంటూ ట్వీట్ చేసాడు ఈయన. అంతేకాదు ఈ చిత్రంలో చాలా భయంకరమైన నిజాలు చెప్పబోతున్నానని ప్రకటించాడు.

  రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా తన సినిమాలో సన్నివేశాలు ఉంటాయని.. అలాంటి వాళ్లకు ఓ లెసన్ తన సినిమా నేర్పిస్తుందని చెప్పాడు వర్మ. న్యాయశాస్త్రాన్ని అడ్డుపెట్టుకుని లాయర్ ఏపీ సింగ్ లాంటి వాళ్లు ఆడుకుంటున్నారు.. వాళ్లతో ఆడుకునేలా తన సినిమా ఉంటుందని చెప్పాడు వర్మ. ఏపీ సింగ్ నిర్భయ దోషుల తరఫున వాదిస్తున్నాడు. వాళ్లకు ఉరి పడకుండా వాయిదాలు పడేలా చేస్తున్నాడు. అలాంటి వాళ్లే తన సినిమాలో విలన్స్ అంటున్నాడు ఈయన.
  Published by:Sulthana Begum Shaik
  First published: