Raj Kundra: రాజ్ కుంద్రా చుట్టు బిగుస్తున్న ఉచ్చు.. సాక్ష్యంతో షాకిస్తామంటున్న ఆ ఉద్యోగులు

షెర్లిన్ చోప్రా - రాజ్ కుంద్రా - పునమ్ పాండే

నీలి చిత్రాల కేసులో రాజ్ కుంద్రా తప్పించుకోలేరా..? ఆయన చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగుస్తోందా..? ఆయన సొంత కంపెనీ ఉద్యోగులే సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వచ్చారు.. ఏం చెప్పబోతున్నారు..

 • Share this:
  నీలి చిత్రాల రాకెట్‌ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త, బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఆయనకంపెనీ ఉద్యోగులే సిద్ధమయ్యారని తెలుస్తోంది. వియాన్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులు ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు సమాచారం. కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆదివారం వెల్లడించారు. నీలిచిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల దగ్గర ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తోంది. వాళ్లంతా పూర్తి వాస్తవాలు చెబితే.. కుంద్రాకు మరిన్ని సమస్యలు ఎదురవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది కుంద్రాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. కొందరు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే కొందరు పోలీసులకు నిజాలు చెప్పేందుకు సిద్ధమంటున్నారు. ఇప్పటి వరకు ఆయనకు మద్దుతుగా ఉన్నవారు ఎవరూ కనిపించడం లేదు.. వ్యతిరేకంగా ఉన్నవారే ఎక్కువ మంది ఉండడంతో ఈ కేసులో కుంద్ర తప్పించుకోవడం కష్టమే అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  ప్రస్తుతం ఆయనపై నీలి చిత్రీకరణ చేస్తున్నట్లు అంతే కాకుండా వాటిని ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఆదాలు కూడా బయట పడుతున్నాయి. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో ఎంతోమందిని తన వైపు లాక్కుని.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని బయటపడటంతో ముంబై పోలీసులు అతనిని అరెస్టు చేశారు. దీంతో అప్పటినుండి ఇతని గురించి ఏదో ఒక వార్త బయటకు వినిపిస్తూనే ఉంది. అంతేకాకుండా పలువురు మోడల్స్ కూడా అతని గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు.

  రాజ్ కుటుంబం లండన్ కి వలస వెళ్లిందని.. ఇక 18 ఏళ్ల వయసులో ఉన్న రాజ్ కుంద్రా నేపాల్ కు చేరుకొని అక్కడ శాలువాల బిజినెస్ పెట్టాడని తెలిసింది. వాటిని బ్రిటన్ ఫ్యాషన్ హౌస్ లో అమ్మడంతో కోట్లకొద్దీ డబ్బులు సంపాదించడట. ఇక దుబాయ్ కి 2007లో వెళ్లి అక్కడ పలు వ్యాపారాలు, లైవ్ బ్రాడ్ కాస్ట్, గేమింగ్ వంటి వాటితో తన సంపాదనను రెట్టింపు చేసుకున్నాడట.

  త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫెమా కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఆయన ఉంటారు. ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులో నాడు టెలివిజన్‌ నటి, మోడల్‌ గెహానా వశిష్ట్‌తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపినప్పటికీ వారు విచారణకు హాజరు కాలేదు.
  Published by:Nagesh Paina
  First published: