ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో అటు సీబీఐ (Central Burew Of Investigation), ఇటు ఈడీ (Enforcement Directorate) దూకుడు పెంచింది. ఈ కేసులో నిన్న ఉదయం ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మాజీ సీఏ బుచ్చిబాబు, అలాగే గౌతమ్ మల్హోత్రా (Goutham Malhothra)ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఒయాసిస్ గ్రూప్ తో మల్హోత్రాకు సంబంధాలున్నాయని అనుమానాలు, ఆరోపణల నేపథ్యంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ అభియోగంపై అతడిని ఈడీ (Enforcement Directorate) అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక తాజాగా ఇవాళ మరొకరిని ఈడీ అరెస్ట్ చేసింది.
చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీ (Rajesh Joshi)ని ఈడీ (Enforcement Directorate) అధికారులు అరెస్ట్ చేశారు. సౌత్ గ్రూప్ తరపున రూ.31 కోట్ల నగదును అతడు దినేష్ అరోరాకు అందజేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. అలాగే గోవా ఎన్నికల్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో రాజేష్ జోషీ (Rajesh Joshi)ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో వరుస అరెస్టులతో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఇటీవల మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఈడీ రెండో ఛార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లు పేర్కొంది. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Delhi cm Kejriwal), వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు ఛార్జ్ షీట్ లో ఈడీ పేర్కొంది. అలాగే అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడారని ఈడీ పేర్కొంది.
ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారి పేరులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కవిత పేరును ఈడీ పేర్కొంది. ఇక ఈడీ (Enforcement Directorate) ఛార్జ్ షీట్ లో తన పేరును ప్రస్తావించడంపై కేజ్రీవాల్ (Delhi cm Kejriwal) సెటైర్లు వేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఈడీ పని చేయడం లేదు. ప్రభుత్వాలను కూల్చడానికి ఈడీ (Enforcement Directorate) పని చేస్తుంది. ఈ ఛార్జ్ షీట్ మొత్తం ఒక కల్పితమని ఢిల్లీ సీఎం కొట్టిపడేశారు.
ఇక తాజా అరెస్టులతో కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. వీరి విచారణ అనంతరం మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Delhi liquor Scam, Enforcement Directorate, Telangana