నిద్రమత్తులో కొడుకును చంపిన తల్లి...నీళ్ల ట్యాంకులో ముంచి..

తన కుమారుడిని తానే చంపేశానని కన్నీళ్లు పెట్టుకుంటూ నేరం ఒప్పుకుంది. ఐతే అలా ఎందుకు చేశానో తనకు తెలియదని..నిద్రమత్తులో జరిగిపోయిందని వెల్లడించింది.

news18-telugu
Updated: May 21, 2019, 6:57 PM IST
నిద్రమత్తులో కొడుకును చంపిన తల్లి...నీళ్ల ట్యాంకులో ముంచి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కన్నతల్లే కాలయముడయింది. నిద్రమత్తులో 6 నెలల కొడుకును చంపేసింది. నీళ్ల ట్యాంకులో ముంచి అతి దారుణంగా హతమార్చింది. మళ్లీ ఏమీ తెలియనట్లుగా..తన కొడుకు కనిపించడం లేదంటూ నటించింది. భర్తతో కలిసి చిన్నారి కోసం గాలించింది. ఐతే పోలీసుల విచారణలో ఎట్టకేలకు నేరం బయపడింది. కన్నతల్లే ఆ పసివాడిని అంతం చేసినట్లు గుర్తించారు. ఘటనపై హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఈ దారుణం జరిగింది.

35 ఏళ్ల దీపికా గుజ్జర్, సీతారామ్ గుజ్జర్ దంపతులు కోటాలోని సరస్వతి కాలనీలో నివసిస్తోంది. సీతారామ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. దీపికా (35) గృహిణి. వీరికి 6 నెలల కుమారుడు (శివ) ఉన్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా దీపికా తన కుమారుడిని తీసుకొని మూడో ఫ్లోర్‌పైకి వెళ్లింది. అక్కడ నీళ్ల ట్యాంకులో బాలుడిని ముంచి చంపేసింది. తిరిగి ఒకటో ఫ్లోర్‌కు వచ్చి యథావిధిగా నిద్రపోయింది. అర్ధరాత్రి సీతారామ్‌కు మెలకువ వచ్చి కుమారుడి కోసం చూశాడు. బెడ్‌పై లేకపోవడంతో అందరినీ నిద్రలేపి ఇళ్లంతా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు.

మరసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సొంత కుమారుడిని చంపిన దీపికా..ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తపడింది. తల్లి ప్రవర్తనపై అనుమానం వ్యక్తంచేసిన పోలీసులు తమ స్టైల్లో విచారించగా...అసలు కథ బయటకొచ్చింది. తన కుమారుడిని తానే చంపేశానని కన్నీళ్లు పెట్టుకుంటూ నేరం ఒప్పుకుంది. ఐతే అలా ఎందుకు చేశానో తనకు తెలియదని..నిద్రమత్తులో జరిగిపోయిందని వెల్లడించింది. ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉందంటున్న పోలీసులు..ఘటనపై దర్యాప్తుచేస్తున్నారు.

First published: May 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు