Udaipur murder case: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు ముస్లిం యువకులు అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిపై కోర్టు ఆవరణలో కొంత మంది దాడిచేశారు.
నుపూర్ శర్మ (nupur sharma) వ్యాఖ్యలను సోషల్ మీడియా (Social media) వేదికగా సపోర్ట్ చేసిన కారణంగా.. రియాజ్ అఖ్తీ, గోస్ మహ్మద్ అనే ముస్లింయువకులు.. టైలర్ ను అతి దుకాణంలో ప్రవేశించి అతిదారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో (Uday pur) శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. వెంటనే రంగంలోనికి కేంద్ర దర్యాప్తు సంస్థలు దిగాయి. 24 గంటలు గడవక ముందే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని అదుపులోనికి తీసుకుని జైలుకు తరలించారు. అయితే, రియాజ్ అఖ్తరీ, గోస్ మహ్మద్ లను విచారణలో భాగంగా జైపూర్ లోని కోర్టుకు తరలించారు.
కోర్టులో విచారణ సందర్భంగా కోర్టు వెలుపల ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు విచారణ అనంతరంల నిందితులు బైటకు వచ్చేటప్పుడు అక్కడే ఉన్న ప్రజలు, లాయర్లు.. వీరిపై దాడులకు తెగబడ్డారు. ఒకనోక సందర్భంలో.. నిందితుల్లో ఇద్దరిని పట్టుకుని పక్కకు లాగి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద వీరిని భద్రత మధ్య ప్రత్యేక వాహనంలో జైలుకు తరలించారు.
#WATCH | Udaipur murder incident: Accused attacked by an angry crowd of people while being escorted by police outside the premises of NIA court in Jaipur
All the four accused were sent to 10-day remand to NIA by the NIA court, today pic.twitter.com/1TRWRWO53Z
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 2, 2022
ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది. కాగా, ఆ సమయంలో కోర్టు ఆవరణంలో.. నిరసన కారులు నిందితులకు. పాక్ కు వ్యతిరేకంగా "పాకిస్తాన్ ముర్దాబాద్" , "కన్హయ్య కే హత్యారోన్ కో ఫ్యాన్సీ దో" (కన్హయ్య హంతకులకు మరణశిక్ష విధించండి) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, నిందితులు టైలర్ ను హత్య చేసిన తర్వాత.. మోదీని కూడా చంపుతామంటూ... సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.