హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking: సోషల్ మీడియాలో ఛాలెంజ్ వివాదం.. నిండు గర్భిణి ముందే భర్తను అతికిరాతకంగా..

Shocking: సోషల్ మీడియాలో ఛాలెంజ్ వివాదం.. నిండు గర్భిణి ముందే భర్తను అతికిరాతకంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: తన భార్య నిండు గర్భిణి. దీంతో ఆమె తన పుట్టింట్లో ఉంటుంది. ఆమెను చూడటానికి భర్త ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో కొందరు యువకుడిని బయటకు రావాలని బెదిరించారు.

కొందరు కావాలని గొడవలు పెట్టుకుంటారు. ఎదుటి వారిని అంతం చేయటానికి ప్రయత్నిస్తుంటారు. చిన్న వాటి వివాదాలను పెద్దవిగా చేస్తారు. ఈ క్రమంలో అవి కత్తిపొట్ల వరకు వెళ్తుంటాయి. క్రమంగా శత్రుత్వం పెంచుకుంటారు. దీనితో ప్రత్యర్థిని చంపడానికి స్కెచ్ లు వేస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) దారుణమైన ఘటన జరిగింది. ఉదయ్ పూర్ జిల్లాలో సోమవారం నాడు నడిరోడ్డుమీద ఉదంతం జరిగింది. ఘిజాలీ అనే వ్యక్తి,ఆటో నడుపుతుండేవాడు. అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. కాగా, ఇతనికి పెళ్లయ్యింది. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఉదయ్ పూర్ లో ఉన్న పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఘిజాలీతన భార్యను చూడటానికి అత్తగారింటికి వెళ్లాడు. తన భార్యతొ కలసి ఇంట్లో ఉన్నాడు. ఇంతలో కొంత మంది యువకుడిని బయటకు రావాలని గట్టిగా అరిచారు. దీంతో అతను బైటకు వచ్చాడు. వెంటనే సద్దాం, మరో ఆరుగురు మూకుమ్మడిగా కత్తులతో దాడికి దిగారు. వెంటనే ఘిజాలీ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. అతని భార్య ఆపడానికి ప్రయత్నించింది.

ఆమెపై కూడా కత్తులతో (brutally attack)  దాడిచేశారు. ఆ తర్వాత.. అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే స్థానికులు ఘిజాలీని ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాడిచేసిన వారికి, ఘిజూలికి గతంలో గొడవలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలింది. అదే విధంగా, సోషల్ మీడియాలో (Social media) కొన్ని రోజుల క్రితం నువ్వంతా.. అంటే నువ్వేంత అని .. చూసుకుందామంటూ.. ఇద్దరు ఛాలెంజ్ అని గొడవ పడ్డారని తెలిసింది. ప్రస్తుతం.. నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణం జరిగింది.

మథుర జిల్లాలోని నాగ్లా బోహ్ర గ్రామంలో ఈ ఘటన ఆదివారం అర్థరాత్రి జరిగింది. కాగా, తేజ్వీర్ సింగ్, సునీత భార్యభర్తలు. వీరికి 16 ఏళ్ల కూతురు ఉంది. తేజ్వీర్ సింగ్.. సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో.. ముజఫర్ నగర్ కు చెందిన రవి అనే యువకుడు.. తేజ్వీర్ సింగ్ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. దీంతో అతని కూతురితో తరచుగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.

రవి, తేజ్వీర్ సింగ్ కూతురుకి ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ (Face book) పెట్టాడు. అయితే, దీనికి ఆమె అంగీకించలేదు. చాలా రోజులు చూశాడు. ఒక రోజు కోపంతో బాలిక ఇంటికి వచ్చాడు. పెళ్లి పత్రికలు (Face book request) ఇవ్వాలనే బాలిక ఇంటికి ఆదివారం అర్ధరాత్రి వచ్చాడు. ఆ తర్వాత.. బాలికను పెళ్లి పత్రిక తీసుకొవాలని కోరాడు. అప్పటిక కత్తి సిద్ధంగా ఉంచుకున్న రవి.. వెంటనే బాలికపై దాడి చేశాడు. దీంతో తల్లి షాక్ కు గురైంది. అయిన అతను ఇష్టమోచ్చినట్లు బాలికపై దాడిచేశాడు.

దీంతో బాలిక కుప్పకూలిపడిపోయింది. ఆమె తల్లిని కూడా కత్తితో గాయపర్చాడు. అతను కూడా కత్తితో (Brutally murder)  పొడుచుకున్నాడు. వెంటనే అక్కడ స్థానికులు చేరుకున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. బాలిక తల్లికి, నిందితుడినికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తేజ్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టారు.

First published:

Tags: Brutally murder, Crime news, Rajasthan

ఉత్తమ కథలు