• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • RAJASTHAN TEMPLE PRIEST ATTEMPTS SUICIDE AFTER BEING BEATEN BY WOMAN IN ALWAR DISTRICT SU

వైరల్‌గా మారిన వీడియో.. ఆత్మహత్యకు యత్నించిన పూజారి.. ఆ వీడియోలో ఏముందంటే..

ప్రతీకాత్మక చిత్రం

తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ పూజారి ఆత్మహత్యకు యత్నించాడు.

  • Share this:
    తనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఓ పూజారి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఆల్వార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆల్వార్ జిల్లాలోని ఓ గుడిలో జ‌గ‌దీశ్ అనే పూజారి ప‌నిచేస్తున్నాడు. గ‌త బుధ‌వారం గుడిలో ఓ మ‌హిళ అతనిని కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పూజారి తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో శుక్రవారం పూజారి విషం తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పూజారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

    ఇక, పూజారి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూజారి కొడుకు ఆ మహిళపై సర్దార్ పోలీస్ స్టేషన్‌లో(Sadar police station) ఫిర్యాదు చేశాడు. మరోవైపు మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూజారి తనను వేధింపులకు గురిచేసినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. అందుకే తాను పూజారిని కొట్టినట్టు తెలిపింది.

    ఇవి కూడా చదవండి: Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గుతుందా..?

    Hyderabad: షాకింగ్.. ఒకేసారి యువతికి రెండు డోసుల వ్యాక్సిన్.. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..

    వేరే కులం వ్యక్తిని ప్రేమించిన యువతి.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు..

    ఈ ఘటనకు సంబందించి పోలీసులు మాట్లాడుతూ..‘పూజారి విధులు నిర్వర్తిస్తున్న గుడిలో మహిళ పూజారిని చెప్పుతో కొట్టింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు, నలుగురు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే పూజారి విషం తాగాడు. అయితే సకాంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది’ అని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు ఫిర్యాదులు అందాయని.. పూర్తి స్థాయి విచారణ జరపాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: