15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్... ‘కాపాడే వ్యక్తి’ని చూసి రోడ్డు మీద నగ్నంగా పరుగులు..

బాధితురాలిని కాపాడేందుకు ఓ యువకుడిని తీసుకొచ్చారు. అయితే, అతడు కూడా తనను రేప్ చేస్తాడన్న భయంతో ఆ బాలిక అతడికి చిక్కకుండా సుమారు అర కిలోమీటర్ దూరం రోడ్డు మీద నగ్నంగా పరుగులు తీసింది.

news18-telugu
Updated: September 12, 2019, 8:12 PM IST
15 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్... ‘కాపాడే వ్యక్తి’ని చూసి రోడ్డు మీద నగ్నంగా పరుగులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజస్తాన్‌లోని భిల్వారా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 15 ఏళ్ల బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలసి గుడికి వెళ్తుండగా దారికాచిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. వారి బారి నుంచి బయటపడిన మిగిలిన ఇద్దరు స్నేహితులు కొంచెం దూరం పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితురాలిని కాపాడేందుకు ఓ యువకుడిని తీసుకొచ్చారు. అయితే, అతడు కూడా తనను రేప్ చేస్తాడన్న భయంతో ఆ బాలిక అతడికి చిక్కకుండా సుమారు అర కిలోమీటర్ దూరం రోడ్డు మీద నగ్నంగా పరుగులు తీసింది. అయితే, చివరకు అతడు తనను కాపాడేందుకు వచ్చాడని తెలుసుకున్న తర్వాత భయంభయంగా అతడిని దగ్గరకు రానిచ్చింది. ఆ బాలికను కాపాడేందుకు అతడు తన దుస్తులను తీసిచ్చాడు.

‘ఆ సమయానికి నేను షాపులో కూర్చుని ఉన్నా. ఓ యువకుడు పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చాడు. ఏదో కంగారుపడుతున్నట్టు నాకు అనిపించింది. తమ ఫ్రెండ్‌ను ఓ ముగ్గురు ఎత్తుకు పోయారని, తమ బైక్‌ను కూడా తీసుకెళ్లిపోయారని, ఆమెను అత్యాచారం చేయొచ్చంటూ భయపడుతూ చెప్పాడు. నేను పరుగు పరుగున అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లా. ఆ సమయంలో ముగ్గురు యువకులు ఆ బాలికను దారుణంగా కొడుతున్నారు. నేను రావడం చూసి ఆ ముగ్గురు యువకులు పరారయ్యారు. అయితే, బాలిక చాలా భయంలో ఉంది. నేను కూడా అత్యాచారం చేస్తానేమోనని భయపడింది. ఒంటి మీద దుస్తులు లేకుండా అర కిలోమీటర్ దూరం పరిగెత్తింది. అయితే, కొన్ని నిమిషాల తర్వాత నన్ను నమ్మింది. నేను నా ఒంటిమీద ఉన్న దుస్తులు తీసిచ్చా.’ అని బాలికను కాపాడిన చాంద్ ఖాన్ తెలిపాడు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు ఖేర్, కైలాష్ ఖేర్ అనే ఇద్దరు యువకులతో పాటు మరో 40 ఏళ్ల వ్యక్తి కూడా బాలిక మీద అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>