అతడికి 19 ఏళ్లు.. ముసలవ్వను లైంగికంగా వేధించడంతో ప్రతిఘటించింది.. కోపంతో ఆమెను చంపి.. చివరకు ఆ మృతదేహంపై..

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు, ఆత్మహత్యలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. తాజాగా ఓ టీనేజర్ ఓ ముసమ్మను చంపి.. ఆ శవంపై అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై హత్యలు(Murder),  అత్యాచారాలు ఆగడం లేదు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువ అయ్యాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలిక(Minor Girl) లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా రాజస్తాన్ లో సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు ఓ కామాంధుడు.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  19 ఏళ్ల యువకుడు తన అవ్వ వయస్సు ఉన్న మహిళపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఆమె ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో కోపంతో అతడు తట్టుకోలేక హత్య చేశాడు. చనిపోయిన తర్వాత కూడా ఆ దుర్మార్గుడు ఆ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని పిలిబంగ పట్టణానికి చెందిన 19 ఏళ్ల సురేంద్రకుమార్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఆ ఊరికి దగ్గరలోనే మరో గ్రామం హనుమాన్‌ఘర్‌ ఉంది. ఈ గ్రామంలో 60 ఏళ్ల ఓ ముసలవ్వ ఉంటోంది.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  ఆమె భర్త మూడేళ్ల కిందట మృతి చెందాడు. ఆమెకు పిల్లలు లేరు. భర్త లేకపోవడంతో ఆమె ఒంటరిగా ఉండటం గమనించాడు సురేందర్ అనే యువకుడు. ఓ రోజు ఎవరూ లేనిది చూసి.. ఆమె ఇంట్లోకి అర్థరాత్రి దొంగలాగా వెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె అతడిని దగ్గరకు రానివ్వకుండా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో అతడు కోపంతో ఆమెను దారుణంగా కొట్టడంతో  చనిపోయింది. అంతటితో అతడికి కామం చల్లారలేదు. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలని ఆమె మృతదేహాన్ని అత్యాచారం చేశాడు. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఆ ముసలవ్వ బావ ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె విగతజీవిగా పడిఉంది.

  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  ఏమైందా ఆరా తీయగా.. సురేంద్ర ఆమె ఇంట్లోకి వెళ్లడం ఆ గ్రామస్తులు చూశాడు. మొదట ఆమె బావకు చెప్పగా .. పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు.
  దీంతో సురేంద్రకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దేశంలో మహిళలకు రక్షణ లేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటువంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుండటంతో మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా  కఠినమైన చట్టాలు తీసుకురావాలంటూ ప్రతీ ఒక్కరూ కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published: