కొందరు బాడా బాబులు తమ అధికారాలను, హోదాను అడ్డంపెట్టుకుని మహిళలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు (Harassment) పాల్పడుతున్నారు. కొందరు అధికారులు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. బరితేగించి తమ కోరికలను తీర్చాలంటూ అడుగుతున్నారు. మరికొందరు పెళ్లి (marriage) చేసుకుంటామని చెప్పి, తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan) ఒక యువతి తనను.. మంత్రి కుమారుడు పలుమార్లు అత్యాచారం చేశాడని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కొడుకు రోహిత్ జోషి (Rohit joshi) తనను గతేడాది జనవరి 8 నుంచి ఏప్రిల్ 17 మధ్య పలుమార్లు అత్యాచారం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి (Marriage fraud) చేసుకుంటానని (Rape on girl) చెప్పాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో.. 2021, ఆగస్టులో తాను ప్రెగ్నెంట్ అయ్యానని, రోహిత్ తనను అబార్షన్ చేసుకొవాలని బెదిరించడంతో యువతి జరిగిన దారుణాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు అప్పటి నుంచి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు జైపూర్ లోని మంత్రి నివాసంలో పోలీసులు నోటిసులను అతికించి పెట్టారు.
అదే విధంగా, మే 18 వ తేదికల్లా లొంగిపోవాలని ఢిల్లీ పోలీసులు (Delhi police) సమన్ లు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై ప్రస్తుతం దేశంలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై అపోసిషన్ పార్టీలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మంత్రి మహేష్ జోషి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లత్ కు అత్యంత సన్ని హితుడు అనే ఈ విధంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, అతని కొడుకుని కఠినంగా శికించాలని బీజేపీ డిమాండ్ చేస్తంది.
12 బాలిక తన తల్లితో పాటు తాత దగ్గర ఉంటుంది. ఆమె తండ్రి 12 ఏళ్ల క్రితమే మరణించాడు. బాలికి తల్లి మానసిక వికలాంగురాలు. ఆమెతో ఎవరితో సరిగ్గా మాట్లాడదు. బాలిక తాత.. తాగుడుకు బానిసయ్యాడు. ఇతను వీరిని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో.. తాత.. మరో ఇద్దరితో కలిసి ఇంట్లోనే బాలికపై అత్యాచారానికి (Rapes girl) పాల్పడేవారు. నెలల తరబడి బాలికపై అఘాయిత్యం జరిపారు. ఈ క్రమంలో బాలిక ఇటీవల పాఠశాలలో అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ఆమెను చూసిన వైద్యులు 5 నెలల గర్భవతి (pregnant)అని తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో బాలిక షాకింగ్ విషయాలు (shocking) వెల్లడించింది. తన తాత.. మరో ఇద్దరు కలిసి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది. తాత.. స్నేహితుడు రాంలాల్ భీల్ (50), అజయ్ బైర్వా (20), వీరు గత నెలలుగా బెదిరిస్తు.. అఘాయిత్యానికి పాల్పడుతున్నారని బాలిక వాపోయింది. వెంటనే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వీరిని అరెస్టు చేశారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర దుమారం చెలరేగింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.