Home /News /crime /

RAJASTHAN MANS NOSE CHOPPED OFF FOR ENDING DAUGHTERS ENGAGEMENT PAH

ఎంగేజ్ మెంట్ క్యాన్షిల్ చేసుకున్న వరుడికి షాక్.. అబ్బాయిపై దాడిచేసి ఏంకట్ చేశారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: తమకుటుంబానికి చెందిన యువతితో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ తర్వాత.. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అబ్బాయి దీన్ని క్యాన్షిల్ చేసుకున్నాడు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India
రాజస్థాన్ లోని బార్మర్ పట్టణంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉండే కమల్ సింగ్ భాటి అనే వ్యక్తి చుట్టాలలోని మరోయువతితో ఎంగేజ్ మెంట్ కు ఏర్పాడు చేశారు. ఇంతలో అతగాడు.. తనకు ఇష్టంలేదన్నాడు. అక్కడివారు ఎంతగా చెప్పడానికి చూసిన పట్టించుకోలేదు. దీంతో వధువు తరపు వారు కోపం పెంచుకున్నారు. కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది కలిసి.. వరుడు ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న వరుడిని బంధించి చితకబాదారు. అంతే కాకుండా ఆమె చెవులు, ముక్కులను కోసేశారు. ఆ తర్వాత.. వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే స్థానికులు అతగాడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తన మేనకోడలు వివాహం చేసుకున్న కుటుంబంలో తన కుమార్తె నిశ్చితార్థాన్ని ఫిక్స్ చేసినట్లు భాటి పోలీసులకు చెప్పాడు. అయితే మేనకోడలిని అత్తమామలు హత్య చేశారని ఆరోపిస్తూ అతడు దానిని విచ్ఛిన్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.



ఇదిలా ఉండగా ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) వింత సంఘటన జరిగింది.

లలిత్ పూర్ నియోజక వర్గానికి చెందిన సచిన్ సాహు అనే పొలిటిషియన్, అభయ్ నామ్ దేవ్ అనే 16 ఏళ్ల బాలుడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. అయితే.. అతను ఇంట్లో పనిచేస్తుండగా ఏదో పొరపాటు చేశారు. దీంతో సచిన్ సాహు రెచ్చిపోయాడు.

అభయ్ నామ్ దేవ్ ను నోటికొచ్చినట్లు తిట్టాడు. అంతే కాకుండా.. కోపంతో అతని ముక్కును కసితీరా కొరికాడు. దీంతో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఝాన్సీ మెడికల్ కాలేజీకి ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే.. బాలుడు కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో (Social media) లో తెగ చక్కర్లు కొడుతుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Rajasthan, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు