Home /News /crime /

RAJASTHAN MAN TRIES TO CRUSH PREGNANT DAUGHTER TO DEATH WITH HIS AUTO FOR MARRYING A HINDU ACT CAUGHT ON CAM PAH

ఓరి దుర్మార్గుడా.. గర్భవతైన కూతుర్ని ఆటో తో తొక్కించి చంపడానికి యత్నం.. వీడియో వైరల్..

పరిగెడుతున్న బాధితులు

పరిగెడుతున్న బాధితులు

Rajasthan: కన్నతండ్రే కూతురు పాలిట కసాయిగా మారాడు. ప్రెగ్నెంట్ అయిన కూతురుని కూడా విడిచిపెట్టలేదు. నడి రోడ్డు మీద ఆటోతో యాక్సిడేంట్ చేసి చంపడానికి ప్రయత్నించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India
అనేక చోట్ల యువత ప్రేమ వివాహలు చేసుకుంటున్నారు. కొంత మంది పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం పెద్దలను ఎదిరించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే.. ప్రేమ వివాహల్లో కొన్నిసందర్భాలలో వేర్వేరు కులాలు, మతాలు చెందిన వారిని ప్రేమిస్తున్నారు. ఈ క్రమంలో తమకన్నా తక్కువ కులం వారని, ఆస్తిలో, అంతస్థులలో తమకన్న తక్కువవారిని ప్రేమించారని, అవతలివారిపై దాడులు చేస్తున్నారు.

ఇలాంటి కొన్ని సందర్భాలలో.. పెళ్లిచేసుకున్న వారిని తల్లిదండ్రులు బెదిరింపులకు గురిచేస్తుంటారు. భౌతికంగా దాడులు చేయడం, హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే ప్రేమ వ్యవహరాలకు సంబంధించి అనేక హత్యల ఘటనలు గతంలో జరిగాయి. సూపారీ రౌడీలకు డబ్బులు ఇచ్చి మరీ తమకు నచ్చని వారిని హత్యలు చేయించారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.





పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan)  దారుణ ఘటన జరిగింది. భరత్ పూర్ లో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే.. నగ్మా అనే యువతి.. అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరు కొన్నిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం కాస్త ఇంట్లో తెలిసింది. వెర్వేరు కులాలు కావడంతో వీరి పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించలేదు. అయితే.. నగ్మా ఇంట్లో నుంచి పారిపోయి నరేంద్రను ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది. అప్పుడు నగ్మా తండ్రి.. ఇస్లాంఖాన్.. తన కూతురుని మోసం చేసి పెళ్లిచేసుకున్నారని.. నరేంద్రపై కేసు పెట్టాడు.దీంతో మధ్యప్రదేశ్ కు వెళ్లి కొన్నినెలల పాటు ఉన్నారు. అక్కడ ఆమె గర్భవతి అయ్యిది.

ఆ తర్వాత.. తిరిగి భరత్ పూర్ కు వచ్చి కాపురం పెట్టారు. అప్పటి నుంచి నగ్మా తండ్రి అదను కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో.. రోటిన్ చెకప్ లో భాగంగా నరేంద్ర, నగ్మా ఆస్పత్రికి వెళ్తున్నారు. అప్పుడు నగ్మా తండ్రి ఆటోలో.. రోడ్డుపై వీరిద్దరు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశాడు. వెంటనే వేగంగా వచ్చి ఇద్దరికి గుద్దడానికి యత్నించాడు. ఆటోను గమనించిన నరేంద్ర, నగ్మా లు అక్కడి నుంచి పారిపోయారు రోడ్డు మీద జనాలు గుమిగూడటంతో ఇస్లాంఖాన్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Rajasthan, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు