హోమ్ /వార్తలు /క్రైమ్ /

OMG: ఛీ.. ఛీ... భార్యపై భర్త అమానుషం.. బంధువులతో కలిసి అత్యాచారం చేయించి, ఆ తర్వాత..

OMG: ఛీ.. ఛీ... భార్యపై భర్త అమానుషం.. బంధువులతో కలిసి అత్యాచారం చేయించి, ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: ఒక భర్త తన భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. కేవలం అదనపు కట్నం తేలేదని తన భార్యను తన ఇంట్లోనే, బంధువులతో కలిసి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు.

Rajasthan man gets wife molested by relatives: ప్రస్తుత సమాజంలో కొంత మంది పెళ్లి కున్న పవిత్ర బంధాన్ని దిగజారుస్తున్నారు. కొన్ని చోట్ల పెళ్లి తర్వాత... పలు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల కోరిన కట్నం ఇవ్వలేదని, మరింత కట్నం తెవాలని తమ భార్యలను హింసిస్తున్నారు. మరికొన్ని చోట్ల పెళ్లైన తర్వాత కూడా వివాహేతర సంబంధాలతో తమ పరువును బజారుకు ఈడ్చుకుంటున్నారు. ప్రధానంగా వరకట్న వేధింపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan)భరత్ పుర్ లో దారుణ మైన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని పున్హానా ప్రాంతంలో 2019 మే 25వ తేదీన రాజ‌స్థాన్ కు చెందిన ఓ వ్య‌క్తితో బాధిత మ‌హిళ‌కు వివాహం జ‌రిగింది. కొన్ని రోజుల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఈ క్రమంలో, అత్తమామలు కట్నం కోసం (Dowry harassment) వేధించడం మొదలుపెట్టారు. ప్రతి రోజు కట్నం తేవాలని ఆమెను మానసికంగా హింసించే వారు. కాగా, ఆమెకు... 1.5 లక్షల నగదు, బుల్లెట్ బైక్ ఇవ్వాలని అత్త మామ, భ‌ర్త‌ డిమాండ్ చేశారు.

వీరి హింసలను తాళలేక ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత.. కొన్ని నెలలపాటు ఆమె అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత.. పెద్దల ఎదుట బాగా చూసుకుంటానని చెప్పించి తిరిగి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. కానీ కొన్ని రోజులకే మరలా అత్తింటి వారు (Harassed woman) వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఒక రోజు భర్త.. తనకు తెలిసిన వారితో ఆమెను పనికి పంపాడు. అతను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

ఆమె గట్టిగా కేకలు వేసి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో భార్య మీద మరింత కోపం పెంచుకున్నాడు. ఒక రోజు భర్త.. మరీ దిగజారీ ప్రవర్తించాడు. తన బంధువులను ఇంటికే పిలిచాడు. తన ఎదుటే భార్యను అత్యాచారం (Rape on wife) చేయించాడు. ఈ దారుణాన్ని ఫోన్ లో రికార్డు కూడా చేశాడు. ఆ తర్వాత.. ఈ వీడియోలను అడల్ట్ సైట్ లో పెడతున్నట్లు తెలిపాడు. నువ్వు ఎలాగో డబ్బులు ఇవ్వవు.. ఇలాగైన డబ్బులు సంపాదిస్తానంటూ ఆమెతో అసహ్యామైన మాటలు మాట్లాడడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు జరిగిన దారుణాన్ని తన పుట్టింటికి వారికి తెలిపింది. వెంటనే వారు సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

First published:

Tags: Dowry harassment, Gang rape, Husband harassment, Rajasthan

ఉత్తమ కథలు