రూ.50 లక్షల బీమా డబ్బుల కోసం.. తనను తానే హత్య చేయించుకున్నాడు..

తానిచ్చిన అప్పును వసూలు చేయలేక.. కుటుంబానికి బీమా డబ్బులైనా వస్తాయని తనను తానే హత్య చేయించుకున్నాడో వడ్డీ వ్యాపారి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 11, 2019, 12:58 PM IST
రూ.50 లక్షల బీమా డబ్బుల కోసం.. తనను తానే హత్య చేయించుకున్నాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇచ్చిన అప్పు తీర్చలేదని దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి.. హత్య చేసిన సంఘటనలు చూశాం.. కానీ తానిచ్చిన అప్పును వసూలు చేయలేక.. కుటుంబానికి బీమా డబ్బులైనా వస్తాయని తనను తానే హత్య చేయించుకున్నాడో వడ్డీ వ్యాపారి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. బల్బీర్‌ ఖారోల్‌(38) అనే వడ్డీ వ్యాపారి స్థానికులకు 6 నెలల కిందట రూ.20 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే, ఆ అప్పును వారి నుంచి వసూలు చేసుకోలేక పోయాడు. గత నెల ఓ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.50 లక్షలకు బీమా పాలసీ తీసుకున్నాడు. ఇచ్చిన అప్పులను వసూలు చేసుకోలేక తీవ్ర ఆందోళనకు గురై మంచాన పడ్డాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. తాను చనిపోతే బీమా పాలసీతో వచ్చే డబ్బైనా తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుందని భావించాడు. తనను హతమార్చేందుకు రాజ్‌వీర్‌ సింగ్‌, సునీల్‌ యాదవ్‌ అనే ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తనను హత్య చేస్తే ఇద్దరికీ చెరో రూ.80 వేలు ఇస్తానని చెప్పి, ఇద్దరికీ చెరో రూ.10 వేల బయానా చెల్లించాడు. అనుకున్నట్లుగా ఈ నెల 2న ముగ్గురూ కలిసి భిల్వారాలో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మిగతా డబ్బు తన జేబుల్లో ఉందని, తనను చంపి ఆ డబ్బు తీసుకోవాలని బల్బీర్‌ చెప్పాడు. నిందితులు అతడి కాళ్లు, చేతులు కట్టేసి గొంతు పిసికి చంపేశారు. అయితే, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలు, మృతుడి కాల్‌డేటాను పరిశీలించి రాజ్‌వీర్‌ సింగ్‌, సునీల్‌ యాదవ్‌లను అరెస్టు చేశారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు