హోమ్ /వార్తలు /క్రైమ్ /

Affair: మాజీ లవర్ తో  ప్రాణ స్నేహితుడి ఎఫైర్.. యువకుడు ఏంచేశాడో తెలుసా..?

Affair: మాజీ లవర్ తో  ప్రాణ స్నేహితుడి ఎఫైర్.. యువకుడు ఏంచేశాడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: తన మాజీ ప్రియురాలితో స్నేహితుడు తరచుగా మాట్లాడుతున్నాడని తెలిసి భరించలేకపోయాడు. తనకు తెలియకుండా ఇంతటి నీచానికి పాల్పడుతున్నాడని కోపం పెంచుకున్నాడు.

సమాజంలో చాలా చోట్ల యువత ఎఫైర్ లు (Love Affair) పెట్టుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కొంత మంది లవ్ ను ఒక స్టేటస్ సింబల్ మాదిరిగా భావిస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. పవిత్ర మైన ప్రేమను కేవలం అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రేమ అనే పేరు చెప్పి అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఆ తర్వాత.. వీడిపోతున్నారు. దీంతో కొందరు ఆవేశానికి లోనై ఎదుటి వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల నమ్మిన స్నేహితులే (Friend cheating)  మోసాలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan) అల్వార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పరమ్ జీత్ సింగ్, దీపక్ కుమార్ ఇద్దరు మంచి స్నేహితులు. అయితే, పరమ్ జీత్ సింగ్ కు ఒక యువతితో ప్రేమలో (love affair)  ఉన్నాడు. కొన్నిరోజుల తర్వాత ఇద్దరు విడిపోయారు. దీంతో ఆయువతి దీపక్ తో మాట్లాడటం ప్రారంభించింది. దీపక్ , సదరు యువతి తరచుగా కలుసుకునే వారు. ఈ విషయం కాస్త పరమ్ కు తెలిసింది. దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. తన స్నేహితుడు, తన మాజీ ప్రియురాలితో (Ex lover)  ఎఫైర్ పెట్టుకొవడం భరించలేకపోయాడు.

వెంటనే అతడిని మాట్లాడుకుందామని ఇంటికి పిలిచాడు. అప్పుడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పరమ్.. దీపక్ ను కర్రతొ తలపై కొట్టాడు. అతను కుప్పకూలీపోయాడు. వెంటనే ఒక సంచిలో కుక్కి.. అడవిలో తీసుకెళ్లి కాల్చేశాడు. దీపక్ మామ.. సీతారాం యాదవ్..తన మేనల్లుడు కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు. వారు పరమ్ పై అనుమానం వ్యక్తం చేశారు. అతడిని అదుపులోనికి తీసుకొని విచారించగా తప్పుని ఒప్పుకున్నాడు. తన మాజీ లవర్ తో ఎఫైర్ పెట్టుకొవడం వలన చంపేశానని చెప్పాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గతంలో రాజస్తాన్ లోని బార్మర్ లో మరో వివాహేతర సంఘటన జరిగింది.

బార్మర్ జిల్లాలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జస్దర్ తలాబ్ సమీపంలో ఏప్రిల్ 27న 22 ఏళ్ల యువకుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సవాయ్, మృతుడి భార్య రాజ్‌కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడి సోదరుడు ధనరామ్ కుమారుడు చోగరామ్ అర్జున్ గురించి ఏప్రిల్ 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రావత్‌సర్‌లో నివాసముంటున్న మదన్‌ గోదార తన సొంత క్యాంపర్‌లో అన్సీ, రాజ్‌కీ, అన్సీ కొడుకు జైపురియాలను తీసుకుని బైతుకు వెళ్లాడు. వీరంతా మృతి చెందిన అర్జున్ రామ్‌ని బలవంతంగా క్యాంపర్‌లో పెట్టి బార్మర్ జస్దర్ ధామ్ సమీపంలోని క్యాంపు వద్దకు తీసుకొచ్చారు. బలవంతంగా మద్యం సేవించి ఆహారం తీసుకుంటుండగా వారి మధ్య గొడవ జరిగింది. మృతుడు అర్జున్ తన భార్య, మేనమామ అన్సీ మధ్య అక్రమ సంబంధంపై అసహనం వ్యక్తం చేశాడు.

అందువల్ల అర్జున్‌రామ్ భార్య రాజ్‌కీ, అన్సీలు అర్జున్‌రామ్‌ను దారిలోకి తీసుకురావాలనుకున్నారు. ఇద్దరూ మదన్ గోదార, జేతారామ్ రావు, జైపురియా, సవైరామ్‌లకు అర్జునుడిని చంపమని చెప్పారు. ఆ తర్వాత వారి లైన్ క్లియర్ అవుతుంది. మద్యం మత్తులో అందరూ కలిసి కర్రలతో అర్జున్‌ను దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు సెక్షన్ 302, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం అన్వేషణ ప్రారంభించారు.

దర్యాప్తు అధికారి సీఓ ఆనంద్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌ ఆధ్వర్యంలో జిల్లా స్పెషల్‌ టీమ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు జైసల్మేర్‌లోని కిషన్‌ఘాట్‌లోని జోగిస్ క్యాంపులో ఉన్నట్లు ఇన్‌ఫార్మర్, సైబర్ టీమ్ సహాయంతో సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం క్యాంపుపై దాడి చేసింది.

First published:

Tags: Crime news, Illegal affair, Love affair, Rajasthan

ఉత్తమ కథలు